
రంగురంగుల ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్.. వెరైటీ గ్రీటింగ్ కార్డ్స్.. గ్రూప్ గ్యాథరింగ్స్.. ఇది ఒకప్పటి మాట.. ఫ్రెండ్‌షిప్ డే అంటే వారం ముందు నుంచే హడావుడి మొదలయ్యేది.. ఎవరికి బ్యాండ్ కట్టాలి.. ఏం మెసేజ్ ఉన్న గ్రీటింగ్ ఇవ్వాలి.. ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి.. అనే మీమాంస కొనసాగేది.. అయితే నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ స్నేహితుల దినోత్సవాన్ని కూడా కొత్తరాగం తీయిస్తోంది.. వర్చువల్ ఫ్రెండ్.. సోషల్ ట్రెండ్ అన్నట్లు గతకాలపు జ్ఞాపకాలతో కూడి రీల్స్, లైక్స్, షేర్స్, వాట్సాప్ స్టేటస్‌ల హోరుతో సెలబ్రేషన్స్ నడిచాయి..
మారిన మానవుని లైఫ్‌స్టైల్ స్నేహితుల దినోత్సవాన్నీ ప్రభావితం చేస్తోంది.. భౌతిక మిలాకత్‌లకు దూరంగా.. వర్చువల్ పరామర్శలకే పరిమితమైంది. స్నేహితులతో సరదాగా తాము తిరిగిన ఫేవరెట్ ప్రదేశాల్లో గడపాల్సిన సమయాన్ని స్క్రీన్ టైం మింగేసిందా? అన్నట్లు నడిచింది.
మునుపటి మధుర స్మృతులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సినిమా పాటలకు మిక్స్ చేస్తూ.. మరోసారి ఆ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
ఖండాలను దాటి..
డిజిటల్ కాలంలో స్నేహం.. కొత్తగా చిగురులను తొడుగుతోంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా వీడియో కాల్స్‌తో కనెక్ట్ అవుతున్నారు. అర్రే నా మిత్రులను కలవలేకపోతున్నానే అనే భావనను, బాధను చెరిపేస్తూ..ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి వేదికలు వేల మంది స్నేహితులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కలి్పస్తోంది. కొత్తవారిని సైతం పరిచయం చేస్తోంది. నేరుగా కలవకున్నామనే బాధను తొక్కిపెట్టి.. అంతకుమించిన ఆనందాన్ని పంచుతోంది.
(చదవండి: అరకు విహారం..ఘుమ ఘుమల కాపీ సేవనం..!)