breaking news
Friend ship band
-
'హార్ట్' ఆఫ్ 'లివింగ్'
అదేదో సినిమాలో ‘‘హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారీ’’ అంటూ బ్రహ్మానందం విష్ చేయగానే ‘‘నేను మీకు ఫ్రెండేమిటి గురువుగారూ’’ అంటాడు జూ. ఎన్టీఆర్ కాస్తంత గురుగౌరవ భావంతో. దానికి బ్రహ్మానందం మళ్లీ ‘‘ఫ్రెండ్షిప్కు ఏజ్ లిమిటేదీ ఉండదురా’’ బదులిస్తాడు. అవును. ఫ్రెండ్షిప్కు వయసుపరంగా చిన్నా పెద్దా అనే ఏజ్ లిమిటు లేనట్టే... సైజు పరంగా కూడా చిన్నా పెద్దా తేడా ఉండదు. అందుకే శ్రీరాముడంతటి వాడికి భక్తితో ఉడత హెల్ప్ చేస్తే... ‘‘నాకే హెల్ప్ చేశావంటే నీ ఫ్రెండ్షిప్ మామూలుది కాదూ... నీ ఫ్రెండ్షిప్పూ, నా ఫ్రెండ్షిప్పూ లోకానికి ఎప్పటికీ తెలియాలం’’టూ దానికి వీపు మీద పర్మనెంట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ను వదిలాడు. అదేంటోగానీ శ్రీరామచంద్రుడికి టాప్ టు బాటమ్... సుగ్రీవుడు మొదలుకొని ఉడత వరకు ఎందరో ఫ్రెండ్సు. పాపం... అంత ఫ్రెండ్షిప్ చేస్తే అర్జునుడికి భగవద్గీత... ఒక్కటే ‘గీత’! కానీ చిన్న హెల్ప్‌తో పెద్ద క్రెడిట్ కొట్టేసిన ఉడుతగారికి మాత్రం మర్యాదాపురుషోత్తముడి నుంచి మాంచి మార్కింగ్లైన్స్ ‘మూడు గీతలు’!! స్నేహం గొప్పదనాల ఉదంతాలకూ... స్నేహం ఔన్నత్త్యాల గురించి ‘నేస్తమ... నేస్తమా’ లాంటి పాటలకూ... కర్ణ సుయోధన, కృష్ణకుచేల, పార్థుడూ ఆయన సారథీలాంటి స్నేహ తార్కాణాలకు కొదవేవీ లేదు. స్నేహభావన గొప్పది కాబట్టే మొదట... తెలివితేటల కంటే ముందుగా ‘చెలిమి’చేతలనూ... నెనరు–నెయ్యాలనూ... కూరిమి–పేరిమిలనూ, మమతా–మైత్రీ భావాలను జీవుల పరిణామానికి ముందునుంచే సృష్టించి పెట్టిందేమో ప్రకృతిమాత! అదెలాగంటారా... ఆక్సిజనూ... కార్బన్ డై యాక్సైడ్ ఇచ్చిపుచ్చుకుంటూ మొక్కలూ, జంతువులూ... పండ్లూ ఫలాలూ ఇచ్చుకుంటూ చెట్టుచేమలూ... ఫారెస్టు యానిమల్సూ... పూల తేనెతేటల ఊటలు పంచుకుంటూ హనీబీలూ–బటర్ఫ్లైసూ.. ఇలా ప్రకృతి నిండా బడ్సీస్ అండ్ ‘బ్రో’లే! పురాణాలూ... ప్రకృతీ వదిలేసి పిక్చర్లూ మూవీలకు వద్దాం. ఎందుకంటే... పురాణాలూ ప్రకృతీ లాంటి సీరియస్ వ్యవహారాలు కాస్త భారంగా ఉంటాయి కాబట్టి... జనాల ట్రెండును నిర్దేశించేవీ, సమాజానికి అద్దం పట్టేవైన సినిమాలతోనే మొదలుపెట్టాం కాబట్టి... వాటితోనే ముగిద్దాం. అప్పట్లో... మిస్సమ్మ మొగుడు ఎన్టీ రామారావు పక్కనే రేలంగీ... అడవిరాముడి పక్కనే ఉండి నవ్విస్తుండే రాజబాబూ... సినీ మధ్యయుగాన... అనేక మంది హీరోల స్క్రీన్మేటు బ్రహ్మానందం... ఇప్పటి ట్రెండుకు తగ్గట్టు మహేశ్‌బాబు ‘మహర్షి’ అయితే పాల్ అల్లరి నరేషూ అదే మహేషు ‘శ్రీమంతుడై’΄ోతే పక్కనుండే ఫ్రెండే వెన్నెల కిషోరూ... అంతెందుకు... ఎర్ర గంధపు చెక్క పుష్పరాజ్ గాడి వెంట ఎప్పుడూ వెన్నంటి ఉండే మంచి ఫ్రెండ్‌షిప్పు తురుపు ముక్క కేశవ... సినిమాలో ఫ్రెండనే ఫార్మూలా సూపర్ డూపర్ బంపర్ హిట్ అయితే... జీవితంలో ఫ్రెండ్సంటే కామన్‌మేన్ కరేజ్‌కు తోడుండే పెద్ద జట్టు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే... (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
Happy Friendship Day 2023: ఆత్మబంధానికి మించి బంధం మరొకటి లేదు!
ఒక మంచి మిత్రుడు వందసార్లు అలిగినా బతిమలాడటం నేర్చుకో. ఎందుకంటే.. నీ కంఠహారంలో ఒక్క బంగారు పూస జారితేనే దొరికేదాకా వెతుకుతావు కదా!నీ మనసెరిగిన స్నేహితుడు అంతకంటే ఎక్కువే మరి! ఈ కొటేషన్ స్నేహం విలువకు అసలైన నిర్వచనం. ఆస్తిపాస్తులు, ఆధునిక హంగులు ఎన్ని ఉన్నా, మనిషికి.. ఆత్మపరిశీలనను మించిన ప్రక్షాళన లేదు. మనసుకు.. ఆత్మబంధాలను మించిన ఆహ్లాదమూ ఉండదు. పుట్టుకతో రక్తసంబంధాలు ఏర్పడితే, ప్రవర్తనతో ఆత్మబంధాలు ముడిపడతాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు, వాటి నుంచి పుట్టే హావభావాలను బట్టే ఆ స్నేహాలు తోడుగా నిలుస్తాయి. గాలి మేఘంతో.. మేఘం నీటితో.. నీరు నేలతో.. నేల మొక్కతో.. మొక్క పువ్వుతో.. పువ్వు పరిమళంతో.. ఇలా సఖ్యత కుదిరిన ప్రతి చోటా స్నేహం వికసిస్తుంది. అయితే, స్వేచ్ఛ నెరిగిన పరిమళం వినువీధుల్లో విహరించేందుకు.. తిరిగి గాలితోనే జత కట్టినప్పుడు.. ప్రకృతి సహజమైన చక్రభ్రమణం ఏర్పడుతుంది. అదే సృష్టి పరిణామం. మరి అన్నివేళలా స్నేహ హస్తాన్ని అందించే గాలి విలువను పెంచాలన్నా, తుంచాలన్నా ఆ పరిమళం చేతిలోనే ఉంటుంది. ఎలా అంటే గాలిని అలముకున్నది సువాసనే అయితే, దాన్ని చుట్టూ ఉన్నవాళ్లు అమితంగా ఆస్వాదిస్తారు. అదే దుర్గంధమైతే ముక్కు చిట్లించి, ఉమ్మివేసి అవమానిస్తారు. ప్రతిమనిషి నేర్చుకోవాల్సిన మిత్రలాభ తంత్రం ఇదే.‘ధనసాధన సంపత్తి లేనివారయ్యియు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని, స్వకార్యములు సాధించుకొందురు’ అనేది ‘మిత్రలాభం’లోని మొదటి వాక్యం. అంటే డబ్బు, సంపద లేకపోయినా బుద్ధిమంతులైన వాళ్లు ఒకరితో ఒకరు స్నేహం చేసి పరస్పర ప్రయోజనాలు సాధించుకోగలరు అని అర్థం. కలిగినదాన్ని పంచుకోవడం, రహస్యాలను చెప్పుకోవడం, సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆపదలో ఒకరిని ఒకరు రక్షించుకోవడం.. ఇవే స్నేహాన్ని, ప్రీతిని తెలిపే గుణాలు. కానుకలిస్తే దేవతలే సంతోషిస్తారు. కేవలం గడ్డి వేసినందుకు.. తన దూడ సంగతైనా చూడకుండా, గడ్డి వేసినవాడికి ఆవు పుష్కలంగా పాలిస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నప్పుడే నిజమైన ప్రేమతో కూడిన స్నేహం బలపడుతుంది. ఇదే స్నేహధర్మం. సినిమాల్లో కొన్ని స్నేహాలు ప్రేమదేశం (1996): స్నేహం కోసం ప్రేమనే త్యాగం చేసే స్నేహితుల కథ. స్నేహం కోసం (1999): స్నేహానికి.. సేవకుడు, యజమాని అనే తేడా లేదని చూపించిన సినిమా. ఇద్దరు మిత్రులు (1999): స్నేహానికి ఆడ, మగ అనే లింగభేదం ఉండదని తెలిపే కథ. స్నేహమంటే ఇదేరా (2001): ‘కుటుంబం ఎక్కువా? స్నేహమెక్కువా?’ అంటే నేస్తాన్నే ఎంచుకున్న గొప్ప స్నేహితుడి జీవితం. నీ స్నేహం (2002): తన జీవితాన్నే త్యాగం చేసేంత గొప్ప స్నేహితుడు.. మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుందో అనిపించే సినిమా. వసంతం (2003): ఫ్రెండ్ జీవితం బాగుండాలని తనకిష్టమైన గమ్యాన్ని వదిలిపెట్టిన ఓ స్నేహితుడి కథ. హ్యాపీ డేస్ (2007): ఎన్ని అపార్థాలొచ్చినా నిజమైన స్నేహం ఎప్పటికీ విడిపోదని చూపిన సినిమా. ఉన్నది ఒకటే జిందగీ (2017): ఈ ప్రపంచంలో మనిషిగా నిలబడాలంటే స్నేహితులు కావాల్సిందేనని చెప్పిన సినిమా. కేరాఫ్ సూర్య (2017): ఏ ఆపదైనా తనని దాటాకే.. తన స్నేహితుడ్ని చేరాలనుకునే దమ్మున్న ధీరుడి కథ. మహర్షి (2019): ఫ్రెండ్ తన కోసం చేసిన త్యాగాలను తెలుసుకుని.. తిరిగి ఆ ఫ్రెండ్ కళ్లల్లో ఆనందం చూడటానికి ఎన్నో మెట్లు దిగిన గొప్ప స్నేహితుడి పరిచయం ఈ సినిమా. ఆర్ఆర్ఆర్ (2022): ఇద్దరు స్నేహితుల ఆశయాలూ గొప్పవే. కానీ ప్రయత్నాలే వేరు. వారి స్నేహం, బంధం అన్నదమ్ముల్ని తలపిస్తూ ఉంటుంది. న్యాయపోరాటంలో ఇద్దరి అడుగులూ ఒక్కటిగా కదిలే కథనమిది. పాటల్లో మైత్రి ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా (ప్రేమ దేశం), దోస్త్ మేరా దోస్త్ (పెళ్లి పందిరి), మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ (స్నేహమంటే ఇదేరా), కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట (నీ స్నేహం), పాదమెటుపోతున్నా పయనమెందాకైనా (హ్యాపీ డేస్), ట్రెండు మారినా ఫ్రెండు మారడే (ఉన్నది ఒకటే జిందగీ) 12 మనస్తత్వాలమిత్రులు మనకోసం ‘శత్రువు ఒక్కడైనా ఎక్కువే.. మిత్రులు వందమంది అయినా తక్కువే’ అన్నారు స్వామీ వివేకానంద. జీవితంలో ఎంతమంది మిత్రులున్నా స్నేహాన్వేషకులకు చాలదు. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఈ 12 రకాల స్నేహితులు దక్కితే.. జిందగీ సాఫీగా సాగుతుందట. 1. ఎమోషనల్ పర్సన్ నీ ముఖంలో చిరునవ్వు చెదిరితే తన కళ్లల్లో నీళ్లొచ్చేంత భావోద్వేగం తనలో ఉంటే.. ఆ బంధం మరణం దాకా శాశ్వతంగా ఉంటుంది. ఇలాంటి దోస్తులు ఆపదలో వెన్నంటే ఉంటారు. 2. మార్గదర్శి బంధువుల్లో, పొరుగువారిలో లేదా తెలిసినవారిలో ఆదర్శంగా నిలిచినవారే ఈ మార్గదర్శి. ఇలాంటి వారితో స్నేహం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కెరీర్లో సెటిల్ కావడానికి.. భవిష్యత్తులో ముందడుగు వేయడానికి వీరి సలహాలు ఎంతో ఉపయోగపడతాయి. 3. నాయకత్వ లక్షణాలతో ఉన్నవారు.. ఇలాంటి వారు సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు. వీరికి మంచి నెట్వర్క్ ఉంటుంది. సేవాగుణం కూడా ఉంటుంది. ఇలాంటి వారికి చాలా విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. మనం ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ఇలాంటివాళ్ల సాయంతో సురక్షితంగా బయటపడొచ్చు. 4. డిఫరెంట్ మైండ్ సెట్.. మనకు మనలానే ఆలోచించే స్నేహితులుంటే ప్రపంచానికి మనం దూరమయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే మన ఆలోచనలకు వ్యతిరేక దిశలో ఆలోచించే స్నేహితులు కూడా ఉండాలి. అప్పుడే మనలో మానసిక సంఘర్షణ మొదలవుతుంది. మంచి, చెడులతో పాటు లోకం పోకడ అర్థమవుతుంది. ఇలాంటి వారితో స్నేహం.. వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుంది. కొన్ని మంచి కొటేషన్లు స్నేహితుడు దైవంతో సమానం. కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది. – మహాత్మా గాంధీ నేను కాంతిలో ఒంటరిగా కాకుండా.. చీకటిలో స్నేహితుడితో నడవడానికి ఇష్టపడతాను. – హెలెన్ కెల్లర్, అమెరికన్ రచయిత్రిఒక వ్యక్తి మరో వ్యక్తితో... ఇక్కడ నేనే ఉన్నాను అనుకున్నాను. నువ్వు కూడా ఉన్నావా? అన్నప్పుడు స్నేహం మొదలవుతుంది. – సీఎస్ లెవిస్, బ్రిటిష్ రచయితనా స్నేహితులే నా ఆస్తి. – ఎమిలీ డికిన్సన్, అమెరికన్ కవయిత్రి (చదవండి: ‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పనెందుకు!) -
‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పనెందుకు!
స్నేహితుల దినోత్సవం సందర్భంగా అంతర్జాలంలో అలనాటి సినిమా ‘దోస్తి’ (1964) తప్పనిసరిగా ప్రస్తావనకు వస్తుంది. సత్యన్‌బోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టింది. ‘బెస్ట్ ఫిల్మ్’ తో సహా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్లు గెలుచుకుంది. ఒక యాక్సిడెంట్లో కాలు కోల్పోయిన రాము, కంటిచూపు లేని మోహన్ అనే ఇద్దరు కుర్రాళ్ల మధ్య స్నేహానికి అద్దం పట్టే చిత్రం ఇది. ఈ ఇద్దరు స్నేహితులకు పాట స్నేహితురాలు. అన్నదాత. ఎన్నో కష్టాలు, ప్రలోభాలు ఎదురైనా వారి స్నేహ ప్రపంచం చెక్కు చెదరదు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చూడాల్సిన సినిమాలలో ఇదొకటి. అలాగే 'స్నేహంలో విభేదాలు ఉండవు’ అని అనుకోవడానికి లేదు. ఎన్నో కారణాల వల్ల ఫ్రెండ్షిప్ బ్రేక్‌డౌన్ కావచ్చు. మళ్లీ కలుసుకోవాలని, మునపటిలా హాయిగా మాట్లాడుకోవాలని ఉన్నా ఏవో ఇగోలు అడ్డుపడుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాశ్చాత్య దేశాల్లో ‘ఇన్విజిబిలియా: థెరపీ విత్ ఫ్రెండ్స్’ అనే ట్రెండ్ మొదలైంది. అనగా ఒక సైకాలజిస్ట్ విడిపోయిన ఇద్దరు స్నేహితులను ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఒకటి లేదా రెండు మూడు రోజుల సెషన్లతో వారి స్నేహాన్ని తిరిగి పట్టాలకెక్కిస్తారు. ‘ఇదంతా ఎందుకు?’ అనుకునేవారు దూరం అయిన ఫ్రెండ్‌కు ‘సారీ రా’ అని మెసేజ్ పెట్టి చూడండి చాలు...‘సారీ’కి ఉండే పవర్ ఏమిటో మీకే తెలుస్తుంది! ఆ నలుగురు స్నేహితులు ఇంగ్లీష్ సింగర్, సాంగ్ రైటర్, మ్యూజిషియన్, పీస్ యాక్టివిస్ట్ జాన్ లెనన్ తన ‘ఇమేజిన్’ పాటలో ఏం అంటాడు? నీ తల మీద ఆకాశం తప్ప, స్వర్గనరకాలు, మతాలు, కులాలు, సరిహద్దు ద్వేషాలు లేని ఒక కొత్త ప్రపంచం, ఆస్తులు, అంతస్తుల తేడా లేని సరికొత్త సమాజాన్ని ఊహించుకో అంటాడు. ‘ఐయామ్ ఏ డ్రీమర్ బట్ ఐయామ్ నాట్ ది వోన్లీ వన్’ అని కూడా అంటాడు. ప్రపంచంలో ఎంతోమందిలాగే ఈ పాటతో ప్రభావితమైన వాళ్లలో బెంగళూరుకు చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు. మెలిషా, వినోద్ లోబో, నితిన్ కుమార్, విగ్నేష్‌లు ‘ఇమేజిన్’ సాంగ్ స్ఫూర్తితో ‘ఇమేజిన్ ట్రస్ట్’ ప్రారంభించారు. సేవా కార్యక్రమాలకు సంబంధించి తొలి దశలో భాగంగా ‘క్లాత్ బ్యాంక్’కు శ్రీకారం చుట్టారు. దాతల నుంచి సేకరించిన ఈ దుస్తులను పేదలు రూపాయి ఇచ్చి కొనవచ్చు. వన్స్‌మోర్ ఫ్రెండ్షిప్ డైలాగ్‌లు నిజమైన స్నేహితులు కన్నీటి చుక్కల్లాంటి వారు. మనసు బాధగా ఉన్నప్పుడు చప్పున బయటికి వస్తారు’ ‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పని ఎందుకు!’ – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమా నిజమైన స్నేహితుడు, స్నేహితుడి తప్పులను తన తప్పులుగా భావించి క్షమిస్తాడు. – ఏ రస్తే ప్యార్ కే స్నేహితుడు చనిపోవచ్చు. స్నేహం చనిపోదు. – ఎల్వోసీ కార్గిల్ స్నేహం అనేది ఎలా బతకాలో మాత్రమే కాదు ఎలా చావకూడదో నేర్పుతుంది. – ఏబీసీడి–ఎనీబడి కెన్ డ్యాన్స్ స్నేహితులు ఉన్న వారే అసలైన సంపన్నులు – రంగ్ దే బసంతీ స్నేహంలోని ఒక నియమం...నో సారీ...నో థ్యాంక్! – కుచ్ కుచ్ హోతా హై (చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!) -
రాఖీని ఎలా కట్టాలి?
సెల్ఫ్ చెక్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేసినంత ఈజీగా ఉండదు. ఒకరి క్షేమాన్ని ఒకరు కాంక్షిస్తూ సంప్రదాయబద్ధంగా చేసుకునే తంతు ఇది. మాటల్లో చెప్పలేని అభిమానానికి దేవుని అనుగ్రహాన్ని రంగరించి వేసే ఆత్మీయబంధనం. 1. మంత్రోచ్చారణతో పూజ చేసి ఆ కుంకుమను నుదుట దిద్ది, పూజాక్షతలను తల మీద వేసిన తర్వాత మాత్రమే రాఖీని కడతారు. ఎ. అవును బి. కాదు 2. సోదరులు తల మీద వస్త్రం ఉంచుకుని దాని మీద అక్షతలు వేయించుకోవాలి. ఎ. అవును బి. కాదు 3. అన్నయ్యకు సోదరి హారతి ఇవ్వాలి, కర్పూరం పూర్తయ్యే వరకు వెలగనివ్వాలి. ఎ. అవును బి. కాదు 4. కొబ్బరికాయకు నూలు దారాన్ని చుట్టి సోదరునికి ఇచ్చిన తర్వాత స్వీటు తినిపిస్తారు. ఎ. అవును బి. కాదు 5. సంప్రదాయ రాఖీ ఎరుపు, పసుపు దారం మధ్యలో గురివింద గింజ సైజులో వెల్వెట్ బాల్ ఉంటుంది. దీనిని బొమ్మనిరాఖీ అంటారు. ఎ. అవును బి. కాదు 6. ఈ పండగరోజు సోదరికి సోదరులు పాదనమస్కారం చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. ఆడపడుచు పుట్టింటికి వెళ్లి రాఖీ కట్టడానికి సాధ్యం కాని పక్షంలో సోదరులే ఆమె ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుంటారు లేదా పోస్టులో పసుపు, కుంకుమ, రాఖీ పంపిస్తారు. ఎ. అవును బి. కాదు 8. సోదరునికి అన్నింటిలోనూ విజయం కలగాలని, సుఖసంతోషాలతో ఉండాలని సోదరి కోరితే, ఆదుకోవడానికి నేను ఉన్నాను అని సోదరుడు తెలియచేయడమే ఈ వేడుక ఉద్దేశం. ఎ. అవును బి. కాదు 9. ఇది పైకి సన్నటి దారంలా కనిపించినప్పటికీ మనసుకు ‘సున్నితమైన, బలమైన బంధం’ అన్న భావనను సూచిస్తుంది. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీ దృష్టిలో రక్షాబంధనం ఒక వేడుక మాత్రమే కాదు అనుబంధాల బంధనం కూడ. ఎదుటి వారి శ్రేయస్సును కోరి కట్టే రాఖీకి ప్రతిగా అవ్యాజమైన అనురాగాన్ని పొందుతున్నారనుకోవాలి.