బతికుండగానే కప్పపై పుట్టగొడుగులు..! షాకవ్వుతున్న శాస్త్రవేత్తలు

Frog Found with Mushroom Growing On Its Body - Sakshi

సహజంగా పుట్టగొడుగులు ఎలా పెరుగుతాయో మనకు తెలిసిందే. కుళ్లిన కలపపై వచ్చు ఒకరకమైన శిలింధ్రం. ఇవి అసాధారణ జీవులు. అవి సాధారణంగా సాప్రోట్రోఫ్‌లు లేదా సహజీవులు. ఇవి పోషకాల సైక్లింగ్‌ను సులభతరం చేస్తాయి. సధారణంగా పుట్టగొడుగులు చనిపోయిన లేదా కుళ్లిన వాటిపై శిలింధ్రాలు పుట్టగొడుగులుగా రావడం జరగుతుంది. బతికి ఉండు జీవుల్లో పుట్టగొడుగులు రావడం అనేది అ‍త్యంత అరుదు. కానీ ఇక్కడొక కప్ప బతికే ఉ‍న్న ఓ బంగారు రంగు కప్ప శరీరంపై పుట్టగొడుగు మొలిచింది. ఇక్కడ కప్ప బతికే ఉంది. అయితే ఇదెలా సాధ్యమని శాస్త్రవేత్తలు షాకవ్వుతున్నారు. 

వివరాల్లోకెళ్దే..ఈ ఫొటోలోని కప్పను బాగా పరిశీలిస్తే మీకు కప్ప మీద ఒక పుట్టగొడుగు కనిపిస్తుంది. ఇది ఒక రకమైన బోనెట్‌ మష్రూమ్‌. పుచ్చిపోతున్న దశలో ఉన్న కలపపైన, లేదా జంతువుల పేడపైన పెరుగుతుంది. అయితే ఇంకా సజీవంగానే ఉన్న కప్ప శరీరంపై కనిపించడం ఇదే మొదటిసారి. దీన్ని ఈ మధ్యనే కర్ణాటక పశ్చిమ కనుమల్లోని కర్కాలలో గుర్తించారు. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఈ కప్పను ‘రావుస్‌ ఇంటర్మీడియట్‌ గోల్డెన్‌ బ్యాక్డ్‌ ఫ్రాగ్‌’ (హైలార్నా ఇంటర్మీడియా)గా గుర్తించారు.

పైగా ఆ కప్ప ఎడమ వైపు నుంచి పుట్టగొడుగు పెరుగుతూ  ఉన్నప్పటికీ కప్ప సజీవంగా, చురుకుగా ఉంది. దీంతో వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌  పరిశోధకులతో సహా శాస్త్రవేత్తలంతా అయోమయంలో పడ్డారు. సజీవంగా ఉన్న కప్ప శరీరంపై పుట్టగొడుగులు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తునే ఉన్నారు. ఇది ఒక రకమైన వ్యాధి వల్ల కావచ్చునని అనుకుంటున్నా.. అందుకు బలమైన ఆధారాలేవీ ఇప్పటివరకు దొరకలేదు. 

(చదవండి: గడ్డకట్టే చలిలో మెడిటేషన్‌ చేస్తున్న యోగి!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top