పరగడుపున ఖర్జూరాలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా? | Foods That Provide Instant Energy To The Body | Sakshi
Sakshi News home page

Energy Foods: ఎప్పుడూ అలసటగా అనిపిస్తుందా? ఇవి తింటే వెంటనే ఎనర్జీ..

Nov 9 2023 1:16 PM | Updated on Nov 9 2023 1:27 PM

Foods That Provide Instant Energy To The Body - Sakshi

ఏ పని చేయకపోయినా నీరసంగా అనిపిస్తుందా? చిన్న పని చేసినా వెంటనే అలసిపోతున్నారా? రాత్రంతా నిద్రపోయినా ఉదయం లేవగానే అలసత్వంగా అనిపిస్తుందా? ఇన్‌స్టంట్‌ ఎనర్జీ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?సింపుల్‌గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు కలిగిన అద్భుతమైన పండు అరటి పండు. ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది.కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అరటిపండు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అలసట, బద్ధకం దూరం అవుతుంది. 

శరీరానికి తగినంత నీళ్లు తీసుకోవడం తప్పనిసరి. హైడ్రెటెడ్‌గా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. అదేవిధంగా అలసట, నీరసం కూడా దూరమవుతాయి.

► రోజుకో కొబ్బరి బోండం తాగండి. ఇది ఇన్‌స్టంట్‌ ఎనర్జీని ఇస్తుంది.



► అప్పుడప్పుడు దాల్చిన చెక్కని బుగ్గన పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఉంటే నీరసం పోతుంది.

► ఖర్జూరం ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి మంచి బలం చేకూరుతుంది. నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక గ్లాసు నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీళ్లను తాగితే శరీరానికి మంచి రక్తం పట్టి ముఖం కాంతిమంతంగా మారుతుంది. 

► రోజూ ఒక గిన్నె పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ప్రొటీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలసట, నీరసాన్ని కూడా దూరం చేస్తుంది.

► గ్రీన్‌ టీ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎనర్జీ రావడమే కాకుండా బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది. 

► రోజుకి ఒకసారి నేలవేము కషాయాన్ని పావుకప్పు మోతాదుగా నీరసం పోతుంది.



► తుమ్మజిగురు శరీరానికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. ఉసిరికాయ అంత జిగురుని కప్పు నీటిలో కలిపి కొంచం పంచదార చేర్చి రోజుకి ఒకసారి తాగితే నీరసం పోయి శక్తి అందుతుంది. 

► తాజా తాటికల్లుని పులవకుండా ఒక మోతాదుగా రోజూ తీసుకుంటూ ఉంటే శరీరానికి మంచి పుష్టి , బలం కలుగును.దీన్నే నీర అని అంటారు.
రోజుకో వెలగపండు తింటే నీరసం పోయి శరీరానికి బలం చేకూరుతుంది.

► ఓట్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.ఇక క్రమం తప్పకుండా ఓట్స్ తినడం వల్ల శరీరానికి మంచి బలం వస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement