ఫరా ఖాన్‌ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..! | Farah Khan Savours Unique South Indian Food At This Mumbai Restaurant | Sakshi
Sakshi News home page

ఫరా ఖాన్‌ ఇష్టపడే వంటకం: ఇడ్లీలో ఇన్ని రకాలా..!

Sep 12 2024 1:20 PM | Updated on Sep 12 2024 1:54 PM

Farah Khan Savours Unique South Indian Food At This Mumbai Restaurant

బాలీవుడ్‌ ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, దర్శకుడు ఫరా ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ వీడియోలు షేర్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా రెసిపీలు, ప్రముఖ రెస్టారెంట్ల భోజనం గురించి అభిమానులతో షేర్‌ చేస్తుంటారు. యఖ్నీ పులావ్‌ నుంచి ఝలక్ దిఖ్లా జా షో సెట్స్‌లో నోరూరించే భోజనం వరకు ప్రతిదీ షేర్‌ చేస్తుంటారు. 

ఆ వీడియోలో ఎక్కువగా ఆహారప్రియులు ఇష్టపడే ప్రముఖ వంటకాలే ఉండటం విశేషం. అలానే ఈ సారి కూడా ముంబైలో ఒక రెస్టారెంట్‌లో పాడ్‌కాస్టర్‌ రాజ్‌ షమనితో కలిసి ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నవీడియోని షేర్‌ చేశారు. ఆ వీడియోలో ముంబైలోని సౌత్‌ టిఫిన్‌హౌస్‌లో కండివలి అనే విచిత్రమైన తినుబండారాన్ని పరిచయం చేశారు ఫరా. 

ఈ మైండ్‌ బ్లోయింగ్‌ సౌత్‌ ఇండియన్‌ ఫుడ్‌ని రాజ్‌ షమానీతో కలిసి ఆస్వాదిస్తున్నట్లు వీడియోలో పేర్కొంది ఫరా ఖాన్‌. వారు అక్కడ టేబుల్‌ వద్ద కూర్చొన్నప్పుడూ సర్వర్‌ ఆ రెసీపీని తీసుకురాగనే ముందుగా వివిధ చట్నీలతో కూడిన ప్లేట్‌ ఒకవైపు మరోవైపు కండివలి అనే విచిత్ర తినుబండారం. ఆ ప్లేట్‌లో వివిధ రాష్ట్రాల్లో ఉండే ఫేమస్‌ ఇడ్లీలు ఉన్నాయి. ఇది చూస్తే ఇడ్లీలో ఇన్ని రకాలు ఉన్నాయా..? అని విస్తుపోతారు. 

అందులో బొగ్గు మాదిరిగా ఉండే ఇడ్లీ చూస్తే వామ్మో ఏంటిది అనుకుంటారు. ఫరా ఖాన్‌ కూడా వీడియోలో బొగ్గు ఇడ్లీని చూపిస్తూ ఇదేం ఇడ్లీరా బాబు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మిగిలి ఇడ్లీలు వరసగా లావా సాంబార్‌ ఇడ్లీ, రాగి ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ, ఆవిడి కుడుములాంటి ఇడ్లీ తదితరాలన్నింటిని వీడియోలో పరిచయం చేసింది. చివరగా రాజ్‌​ కారప్పోడి నెయ్యితో ఉన్న ఇడ్లీని టేస్ట్‌ చేస్తూ బాగుందని చెబుతాడు. 

నిజంగానే బాగుందా? అని ఆశ్యర్యంగా అడుగుతుంది ఫరా. ఏం పర్లేదు బేషుగ్గా తినొచ్చు. బాగుంది ఇడ్లీ అని చెబుతాడు. ఫరా ఈ వీడియోని వ్యాపార సలహాలు అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ వీడియోకి ఏకంగా లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి.

 

(చదవండి: నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!)

 

Advertisement
 
Advertisement
Advertisement