కళ్లు కేవలం చూపు కోసం మాత్రమే కాదు, శరీరంలోని అంతర్గత ఆరోగ్యానికి, ముఖ్యంగా రక్తనాళాల పరిస్థితికి అద్దంపడుతాయి. కంటిలో ఉండే రెటీనాలో సూక్ష్మమైన రక్తనాళాల వలయం ఉంటుంది. కంటి పరీక్ష చేసేటప్పుడు రక్తనాళాల ఆరోగ్యంతో సహా, శరీరంలోపల ఏమి జరుగుతుందో కళ్ళు చెప్పేస్తాయి.
హైబీపీ, మధుమేహం వంటి పరిస్థితులతో రక్త నాళాలలో మార్పులు ఉంటే, అవి గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. కాబట్టి గుండె సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను గుర్తించడంలో రెటీనా ఇమేజింగ్ సహాయపడుతుందా అని పరిశోధకులు అన్వేíÙస్తున్నారు. రెటీనా ఫొటోగ్రఫీ – ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌ల ఆధారంగా అధ్యయనాలు జరుగుతున్నాయి.
శరీర నాళాల ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి కన్ను ఒక గవాక్షంలా పని చేస్తుంది. శస్త్రచికిత్స అవసరం లేని పరీక్షసాధనంగా ఉపయోగపడుతుంది. దాంతో పరిశోధకులలో రెటీనా ఇమేజింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది.
రెటీనా ఫొటోగ్రఫీ, ఆరి్టíఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో వచి్చన పురోగతితో, రెటీనాలోని రక్త నాళాలలో ఉండే సూక్ష్మమైన నమూనాలు గుండె జబ్బుల ప్రమాదం గురించి అదనపు సమాచారాన్ని ఏ మేరకు అందించగలుగుతాయి, ఆ సమాచారంలో కచి్చ తత్వం పాళ్లు ఎంత ఉండవచ్చు– అని కూడా పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.
కంటి స్కాన్‌ను గుండె ధమనులు మూసుకుపోయాయో లేదో నిర్ధారించే పరీక్షగా గానీ, లేదా గుండె పనితీరును పరిశీలించడానికి ప్రత్యామ్నాయంగా గానీ పరిగణించకూడదని కార్డియాలజీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ అంటున్నారు.
రక్తనాళాల గురించి కళ్లు ఏం చెబుతాయి!రెటీనా అసాధారణమైన దేహభాగం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తిని నూటికి నూరుశాతం బలపరిచే ఇంద్రియం. కంటికి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం లేకనే రక్తనాళాలను గమనించడానికి వీలుగా ఉంటుంది రెటీనా నిర్మాణం. రెటీనాలోని రక్తనాళాల పరిమాణం, ఆకారం, వాటి స్థితిలో వచి్చన మార్పులను వైద్యులు తెలుసుకోగలుగుతారు. ఈ మార్పులను బట్టి వైద్యులు హైబీపీ, మధుమేహం, వాసు్కలర్ వ్యాధుల ముందస్తు దశను గ్రహించగలుగుతారు. ఇవన్నీ కూడా గుండెజబ్బులకు దారితీసే ప్రమాదకరమైన కారకాలు అని డాక్టర్ కుమార్ వివరించారు.
కంటిస్కాన్ గుండెలో బ్లాక్‌ను గుర్తించగలదా?
గుండెజబ్బులను నిర్ధారించడానికి కంటిస్కాన్ మీద ఆధారపడలేమని, పైన చెప్పుకున్నట్లు హైబీపీ, మధుమేహం, గుండె వ్యాధుల ముప్పును గుర్తించడానికి ఒక సూచనగా, హెచ్చరికగా పనిచేస్తుందన్నారు. అలాగే రెటీనా స్కాన్ గుండె ధమనుల్లో బ్లాక్‌లను కూడా చూపించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కంటి స్కాన్‌ను కార్డియాక్ టెస్టులకు ప్రత్యామ్నాయంగా పరిగణించలేం. కానీ ప్రమాద హెచ్చరికగా ఉపయోగపడుతుంది.
రక్తనాళాల మార్పులను ఏఐ గుర్తిస్తోందా!
కంటికి కనిపించని సన్నని రక్తనాళాలను ఏఐ గుర్తించగలుగుతోంది. ఒక వ్యక్తికి భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని ఏఐ అంచనా వేయగలుగుతోంది. ఇది కూడా గుండెకు జరిగే హాని గురించి హెచ్చరిక వరకే, నిర్ధారణకు ఏఐ సూచన కూడా సరిపోదు.
– సాక్షి, స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: ప్రతి శ్వాసకూ మెదడులో ప్రత్యేక ముద్ర!


