breaking news
Retinal scan
-
కంటి స్కాన్.. గుండె జబ్బులను గుర్తిస్తుందా?
కళ్లు కేవలం చూపు కోసం మాత్రమే కాదు, శరీరంలోని అంతర్గత ఆరోగ్యానికి, ముఖ్యంగా రక్తనాళాల పరిస్థితికి అద్దంపడుతాయి. కంటిలో ఉండే రెటీనాలో సూక్ష్మమైన రక్తనాళాల వలయం ఉంటుంది. కంటి పరీక్ష చేసేటప్పుడు రక్తనాళాల ఆరోగ్యంతో సహా, శరీరంలోపల ఏమి జరుగుతుందో కళ్ళు చెప్పేస్తాయి.హైబీపీ, మధుమేహం వంటి పరిస్థితులతో రక్త నాళాలలో మార్పులు ఉంటే, అవి గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. కాబట్టి గుండె సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను గుర్తించడంలో రెటీనా ఇమేజింగ్ సహాయపడుతుందా అని పరిశోధకులు అన్వేíÙస్తున్నారు. రెటీనా ఫొటోగ్రఫీ – ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌ల ఆధారంగా అధ్యయనాలు జరుగుతున్నాయి.శరీర నాళాల ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి కన్ను ఒక గవాక్షంలా పని చేస్తుంది. శస్త్రచికిత్స అవసరం లేని పరీక్షసాధనంగా ఉపయోగపడుతుంది. దాంతో పరిశోధకులలో రెటీనా ఇమేజింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది.రెటీనా ఫొటోగ్రఫీ, ఆరి్టíఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో వచి్చన పురోగతితో, రెటీనాలోని రక్త నాళాలలో ఉండే సూక్ష్మమైన నమూనాలు గుండె జబ్బుల ప్రమాదం గురించి అదనపు సమాచారాన్ని ఏ మేరకు అందించగలుగుతాయి, ఆ సమాచారంలో కచి్చ తత్వం పాళ్లు ఎంత ఉండవచ్చు– అని కూడా పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.కంటి స్కాన్‌ను గుండె ధమనులు మూసుకుపోయాయో లేదో నిర్ధారించే పరీక్షగా గానీ, లేదా గుండె పనితీరును పరిశీలించడానికి ప్రత్యామ్నాయంగా గానీ పరిగణించకూడదని కార్డియాలజీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ అంటున్నారు. రక్తనాళాల గురించి కళ్లు ఏం చెబుతాయి!రెటీనా అసాధారణమైన దేహభాగం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తిని నూటికి నూరుశాతం బలపరిచే ఇంద్రియం. కంటికి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం లేకనే రక్తనాళాలను గమనించడానికి వీలుగా ఉంటుంది రెటీనా నిర్మాణం. రెటీనాలోని రక్తనాళాల పరిమాణం, ఆకారం, వాటి స్థితిలో వచి్చన మార్పులను వైద్యులు తెలుసుకోగలుగుతారు. ఈ మార్పులను బట్టి వైద్యులు హైబీపీ, మధుమేహం, వాసు్కలర్ వ్యాధుల ముందస్తు దశను గ్రహించగలుగుతారు. ఇవన్నీ కూడా గుండెజబ్బులకు దారితీసే ప్రమాదకరమైన కారకాలు అని డాక్టర్ కుమార్ వివరించారు.కంటిస్కాన్ గుండెలో బ్లాక్‌ను గుర్తించగలదా? గుండెజబ్బులను నిర్ధారించడానికి కంటిస్కాన్ మీద ఆధారపడలేమని, పైన చెప్పుకున్నట్లు హైబీపీ, మధుమేహం, గుండె వ్యాధుల ముప్పును గుర్తించడానికి ఒక సూచనగా, హెచ్చరికగా పనిచేస్తుందన్నారు. అలాగే రెటీనా స్కాన్ గుండె ధమనుల్లో బ్లాక్‌లను కూడా చూపించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కంటి స్కాన్‌ను కార్డియాక్ టెస్టులకు ప్రత్యామ్నాయంగా పరిగణించలేం. కానీ ప్రమాద హెచ్చరికగా ఉపయోగపడుతుంది.రక్తనాళాల మార్పులను ఏఐ గుర్తిస్తోందా! కంటికి కనిపించని సన్నని రక్తనాళాలను ఏఐ గుర్తించగలుగుతోంది. ఒక వ్యక్తికి భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని ఏఐ అంచనా వేయగలుగుతోంది. ఇది కూడా గుండెకు జరిగే హాని గురించి హెచ్చరిక వరకే, నిర్ధారణకు ఏఐ సూచన కూడా సరిపోదు.– సాక్షి, స్పెషల్ డెస్క్ఇదీ చదవండి: ప్రతి శ్వాసకూ మెదడులో ప్రత్యేక ముద్ర! -
మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకోండి
నిడమర్రు : ఆధార్ కార్డు తీసుకున్న ప్రతీ ఒక్కరూ, వారి వేలిముద్రలతో పాటు కంటి రెటీనల్ స్కాన్ డేటాను ప్రభుత్వానికి సమర్పించారు. ఆధార్ సంఖ్య కోసం ఈ విధంగా సమర్పించిన డేటాను టెక్నికల్ పరిభాషలో ‘బయోమెట్రిక్ డేటా’ అని పిలుస్తారు. ఇలా సేకరించిన మీ బయోమెట్రిక్ డేటాను ఆధార్ వెరిఫికేషన్ నిమిత్తం ఉపయోగిస్తారు. కొత్త సిమ్ కార్డు దరఖాస్తు చేసుకున్నప్పుడు గుర్తింపు కార్డు కింద ఆధార్ కార్డును కేవైసీ వెరిఫికేషన్ నిమిత్తం సంబంధిత టెలికం కంపెనీ, మీ వేలిముద్ర ఆధారంగా బయోమెట్రిక్ వివరాల పరిశీలనకు ఉపకరిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ–హాజర్ నిమిత్తం ఈ బయోమెట్రిక్ డేటా ద్వారానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ ఆధార్ డేటాను లాక్ చేసుకోవడం ద్వారా మరింత సురక్షితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. డేటా లాక్/అన్‌లాక్‌కు అవకాశం ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలతో ఎంతో సురక్షితమని భావిస్తున్న ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ విషయంలో అంత సెక్యూర్ కాదన్న వాదనలతోపాటు, దుర్వినియోగమవుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో బయోమెట్రిక్ ప్రమాణీకరణను మరింత సురక్షితం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా మీ ఆధార్ బయోమెట్రిక్ డేటా సురక్షితంగా ఉంచుకునేందుకు లాక్/అన్‌లాక్ అవకాశం కల్పించింది. లాక్ చేసుకోవడం మరింత సురక్షితం భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే యూఐడీఏఐ సర్వర్లలో లాక్ అయి ఉన్న మీ బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ చేసుకోవటం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా మీ బయోమెట్రిక్ డేటాను వేరొకరు యాక్సిస్ చేసుకునే అవకాశం ఉండదు. మీకు అవసరమైనపుడు మాత్రమే ఆన్‌లాక్ చేసుకుని, అవసరం లేనప్పుడు లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్టర్ మొబైల్‌కు అందే ఓటీపీ ద్వారా మాత్రమే ముందుకు కదులుతుంది. ఆధార్ డేటా లాక్ ఇలా.. ముందుగా మీ కంప్యూటర్లో ఆధార్ అధికారిక వెబ్సైట్ uidai.gov.in లోకి లాగిన్ కావాలి. అక్కడ తెలుగు భాషను ఎంపిక చేసుకోవాలి. కనిపించే ట్యాగుల్లో ఆధార్ సేవలు అని కనిపించే కాలంలో బయోమెట్రిక్ తాళం వేయుట/తీయుట అనే అంశం వద్ద క్లిక్ చేయాలి. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన కాలమ్ కింద మరో సెక్యూరిటీ కోడ్ కాలమ్ మీకు కనిపిస్తుంది. అక్కడపైన ఉంచిన సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. పేజీలో కింద కనిపించే జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్‌తో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో ఓటీపీ అందుతుంది. ఈ ఓటీపీ సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్‌ను చెక్ చేసుకోండి. ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్‌ను చెక్ చేసిన తర్వాత ఎనేబుల్ అప్షన్‌పై క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ బయోమెట్రిక్ వివరాలు లాక్ అవుతాయి. ఒకవేళ లాక్‌ను డిజేబుల్ చేయాలనుకుంటే ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్‌ను ఆన్‌చేసి డిజేబుల్పై క్లిక్ చేయండి. ఈ సూచనల ప్రకారం మీ ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. యూజర్ తన ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయటం ద్వారా ఆధార్ సంబంధిత లావాదేవీలు, అలానే రిక్వస్ట్‌లను ఓటీపీ ఆధారంగానే మేనేజ్ చేయగలుగుతారు. వీళ్లకు సంబంధించిన వేలి ముద్ర/ఐరీస్ స్కాన్లు లాక్ అవుతాయి.


