ఈ భూమిపై ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అందులో కొన్ని సహజంగా ఏర్పడినవయితే, మరికొన్ని మానవ మేధస్సుతో నిర్మితమైనవి. మారుతున్న కాలానుగుణంగా నూతన పరిఙానంతో కూడిన మానవ నిర్మాణాల్లో 'పనామా కాలువ' కూడా ఒకటి. దీని గురించి చూసినట్లయితే..
ప్రపంచంలో మానవులు నిర్మించిన జలమార్గాల్లో ఇదొక అద్భుత నిర్మాణం. ఇది (Panama Canal) మధ్య అమెరికాలోని పనామా దేశంలో ఉంది. అట్లాంటిక్ మహాసముద్రాన్ని అలాగే, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతూ 82 కిలోమీటర్ల పొడవును కలిగి ఉన్న జలమార్గం. పొడవు సుమారు 82 కిలోమీటర్లు, వెడల్పు సాధారణంగా 91 మీటర్ల నుండి 300 మీటర్ల వరకు మారుతుంది. లోతు సుమారు 12 నుండి 15 మీటర్లు. మూడు ప్రధాన లాక్ప్.. గాటూన్ లాక్స్, పెడ్రో మిగెల్ లాక్స్, మిరాఫ్లోరెస్ లాక్స్ సిస్టమ్ ని కలిగిఉంది. ప్రయాణ సమయం.. 8 నుండి 10 గంటలు పడుతుంది.
ఎలా పనిచేస్తుందంటే?
పనామా కాలువ కేవలం లాక్స్ సిస్టంతోనే పనిచేస్తుంది. ఈ కాలువ వద్ద భూమి సముద్రమట్టం కంటే ఎత్తుగా ఉండగా.. ఈ నిర్మాణంతో ఓడలు పైకెత్తడం, కిందకు దించుతారు. కాలువలో పెద్ద పెద్ద నీటి గదులు లాక్స్ రూపంలో ఉంటాయి. ఇవి ఓడలు వచ్చినప్పుడు వాటి పరిమాణం తగ్గట్టుగా అటూ, ఇటూ జరుగుతుంటాయి. ఓడ ఒక లాక్ చాంబర్‌లోకి వెళ్లగానే గేట్లు మూసేస్తారు. మరో పక్కనుంచి నీటిని చాంబర్‌లోకి వదులుతూ, నీటి స్థాయి పెరిగేలా చేసి ఓడను పైకెత్తుతారు. ఈ విధంగా మూడు ప్రధాన లాక్స్ ద్వారా ఓడను పైకెత్తి.. సమాంతర స్థానానికి చేరగానే నీటి సహాయంతో ప్రయాణించేలా చేస్తారు.
తరువాత అట్లాంటిక్ నుంచి బయలు దేరిన ఓడలను చివరగా పసిఫిక్ వైపుగా దిగేలా చేస్తారు. ఈ కాలువ నీటి వంపులను వినియోగించకుండా కేవలం గురుత్వాకర్షణతోనే పనిచేయబడుతుంది. అంటే నీరు ఒక లెవెల్ నుంచి మరో లెవెల్ కు సహజంగా ప్రయాణించేలా దీని నిర్మాణం చేయబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక నీటి ఎలివేటర్ లాంటిదన్నమాట. సముద్ర మట్టాలు రెండు వైపులా వేరుగా ఉండటం, అలాగే, మధ్యలో ఎత్తైన భూభాగం ఉండటం వల్ల దీనిని 'లాక్ సిస్టమ్' ద్వారా నిర్మించారు. ఓడలు లాక్‌ల ద్వారా దాదాపు 85 అడుగుల ఎత్తుకు చేరుకుంటాయి. తరువాత గటూన్ సరస్సుపైగుండా ప్రయాణిస్తూ, అవతలి వైపు సముద్రమట్టానికి చేరుకుంటాయి. ఈ కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత అట్లాంటిక్–పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఇదివరకున్న 9500 కిమీ కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడమే కాకుండా వాణిజ్య వ్యాపారాలకు సమయం ఆదా చేయడంలో ఈ పనామా కాలువ ఎంతగానో ఉపయోగపడుతుంది.


