బిల్‌గేట్స్‌కు చాయ్‌, ప్రధాని మోదీకి కూడా చాయ్‌ : డాలీ చాయ్‌వాలా | Dolly Chaiwala dont no who served tea Bill Gates check his wish | Sakshi
Sakshi News home page

బిల్‌గేట్స్‌కు చాయ్‌, ప్రధాని మోదీకి కూడా చాయ్‌ : డాలీ చాయ్‌వాలా

Published Fri, Mar 1 2024 5:14 PM | Last Updated on Fri, Mar 1 2024 6:00 PM

Dolly Chaiwala dont no who served tea Bill Gates check his wish - Sakshi

మైక్రోసాఫ్ట్‌ బిల్‌ గేట్స్‌, నాగపూర్‌ డాలీ చాయ్‌వాలా మీట్‌

అసలు ఆయన బిల్‌ గేట్స్‌ అని తెలియదు

 ప్రధాని మోదీకీ నా చాయ్‌ రుచి చూపించాలి:  చాయ్‌వాలా 

భారత్‌ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌  కోఫౌండర్‌ బిల్‌గేట్స్‌ సోషల్‌ మీడియా స్టార్‌, డాలీ చాయ్‌వాలా వద్దకు వెళ్లి చాయ్‌ తాగిన వీడియో వైరల్‌ అయింది. దీంతో మరోసారి  మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సునీల్ పాటిల్ వార్తల్లోకి వచ్చేశాడు.  ఈ సందర్భంగా చాయ్‌వాలా చేసిన కమెంట్స్‌ విశషంగా నిలుస్తున్నాయి.

బిల్‌ గేట్స్‌ డాలీ చాయ్‌వాలా మీట్‌పై మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు.  విదేశం నుంచి వ్యక్తి  అని మాత్రం అనుకున్నా.. కానీ  ఆయన  బిట్‌ గేట్స్‌ అని అస్సలు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అందరికీ ఇచ్చినట్టే అతనికీ టీ ఇచ్చాను. తరువాత నాగ్‌పూర్‌కి తిరిగి వచ్చాక తాను ఎవరకి టీ ఇచ్చిందీ గుర్తించానని తెలిపాడు. 

బిల్ గేట్స్ తన దగ్గరికి వచ్చి 'వావ్, డాలీకి చాయ్' అన్నారని గుర్తు చేసుకున్నారు. పనిలో బిజీగా ఉండి, ఆయన తన పక్కనే ఉన్నా, తాను అస్సలు మాట్లాడలేక పోయానని చెప్పాడు. దక్షిణాది సినిమాలు చూస్తా.. వాటినుంచే స్టైల్స్ నేర్చుకున్నా.. వెరైటీ టీ అందిస్తూ ‘నాగ్‌పూర్ కా డాలీ చాయ్‌గా మారా’ అంటూ తన స్టయిల్‌ గురించి వెల్లడించాడు. అంతేకాదు 'భవిష్యత్తులో ప్రధాని నరేంద్రమోదీకి కూడా టీ అందించాలనుకుంటున్నా అంటూ తన మనసులోని కోరికను బైట పెట్టాడు.

కాగా సునీల్ పాటిల్ టీస్టాల్‌తో ఉపాధిని వెదుక్కోవడమే కాదు, తన డ్రెస్సింగ్ స్టైల్, టీ తయారీలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ‘డాలీ చాయ్ వాలా’ పేరుతో ఇన్ స్టాగ్రామ్‌లో కూడాసెలబ్రెటీగా మారిపోయిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement