ఖరీదైన కారులో వడా పావ్‌ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం | Delhi Vada Pav Girl Chandrika Dixit Flaunts Her New Ride In Ford Mustang | Sakshi
Sakshi News home page

ఖరీదైన కారులో వడా పావ్‌: ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం

May 7 2024 5:22 PM | Updated on May 7 2024 5:44 PM

Delhi Vada Pav Girl Chandrika Dixit Flaunts Her New Ride In Ford Mustang

హైదరాబాద్‌ కుమారాంటీ తరహాలో సంచలనం రేపిన  వడా పావ్‌ గర్ల్‌ మరోసారి సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. ఖరీదైన కారుతో కనిపించి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. లగ్జరీ, దాదాపు కోటి రూపాయల అద్భుతమైన ఫోర్డ్ మస్టాంగ్‌లో వడా పావ్‌ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.

ఢిల్లీకి చెందిన "వడా పావ్ గర్ల్" చంద్రికా దీక్షిత్ మంగోల్‌పురి ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తుంది. రోజూ వందల మందికి వడ పావ్‌ను విక్రయిస్తుంది. అలా వడా పావ్ గర్ల్‌‌గా బాగా ఫేమస్ అయింది. ఇన్‌స్టాలో 31 ల‌క్షల మందికి పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఫోర్డ్ ముస్టాంగ్‌  కారులో వడాపావ్‌ అమ్ముతానంటూ  ఇన్‌స్టాలో  ఒక వీడియోను పోస్ట్‌ చేసింది.  "వడ పావ్ అమ్మాయి ముస్తాంగ్ కారులో వడా పావ్ అమ్మడం ప్రారంభించింది." అని  ప్రకటించింది. అంతేకాదు వెయట్‌ చేయండి..  వడాపావ్‌తో పాటు త్వరలో ఒక పెద్ద ప్రకటన రాబోతోంది అని కామెంట్‌ చేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా చప్పట్ల మోత మోగించారు. 

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్‌ ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేసింది. భారత మార్కెట్లో  ఈ కారులే టెస్ట్‌ వెర్షన్‌  ధర సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

 కాగా  ఇటీవల తనను పోలీసులు అరెస్ట్‌ చేశారంటూ ఒకవీడియో వైరల్‌ అయింది. అయితే ఆమెను అరెస్ట్‌ చేయలేదని ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ముస్తాంగ్ కారు నుండి బయటికి రావడం, సరికొత్త ఐఫోన్, ఐవాచ్, ఎయిర్‌పాడ్‌లను కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన రీల్స్  చేసింది. అలాగే  పోర్స్చేతో సహా ఖరీదైన కార్లతో పోజులిచ్చింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement