ఆస్కార్‌ రెడ్‌ కార్పెట్‌: ఆ స్టార్ల రెడ్‌ పిన్‌ కథేమిటి? | check the reason behindHollywood Stars Wear Red Pins At Oscars 2024 Red Carpet | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ రెడ్‌ కార్పెట్‌: ఆ స్టార్ల రెడ్‌ పిన్‌ కథేమిటి?

Mar 11 2024 1:06 PM | Updated on Mar 11 2024 4:39 PM

check the reason behindHollywood Stars Wear Red Pins At Oscars 2024 Red Carpet - Sakshi

ఆస్కార్ 2024 సంరంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డులుగాభావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్‌ తారలు రెడ్‌ కార్పెట్‌పై  ప్రత్యేకంగా కనిపించారు. 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో  పలువురు సెలబ్రిటీలు స్టార్లు అంతా రెడ్‌ పిన్‌లు ధరించడం  విశేషంగా నిలిచింది.  వీరి ఫోటోలు  వైరల్‌ గా మారాయి.

భీకర బాంబుల దాడులతో దద్దరిల్లిన గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ వారంతా రెడ్‌  పిన్‌లను ధరించారు.  అలాగే కాల్పుల విరమణకు పిలుపు నివ్వమని  అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ను కోరుతూ ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇజ్రాయెల్,  గాజాలో హింసను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యుద్ధంలో  వేలాదిమంది, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 

గాజాలో శాంతిని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని 'పూర్ థింగ్స్' నటుడు రమీ యూసఫ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రతకో పిలుపునిస్తున్నామనీ, పాలస్తీనా ప్రజలకు శాశ్వత న్యాయం , శాంతి కలిగేలా చర్యలు చేపట్టాలని  కోరుకుంటున్నామన్నారు. అర‌చేతిలో  ఒక న‌ల్ల రంగు గుండెతో డిజైన్‌ చేసిన ఈ రెడ్ పిన్నుల‌ను  ఆర్టిస్ట్‌4సీజ్‌ఫైర్ అనే సంస్థ తయారు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement