ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌

Bilkis Bano case SC Judgement Victory For All Women Says Vinesh Phogat - Sakshi

బిల్కిస్‌ బానో కేసులో   దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పుపై  ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్‌ మెడల్‌ విజేత‌ వినేష్‌ ఫోగట్‌ (Vinesh Phogat) స్పందించారు. ఇది మహిళల విజయం అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.ఈ పోరాటంలో విజయం సాధించిన బిల్కిస్‌ బానోకు అభినందనలు తెలిపారు.   “బిల్కిస్ జీ, ఇది మన మహిళలదరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు.  మీ విశ్వాసం చూసి మాకూ ధైర్యం  వచ్చింది” అని ఫోగట్ ట్విటర్‌లో పేర్కొంది.

బీజేపీ ఎంపీ,మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు  చేసిన చాలా పెద్ద పోరాటమే  చేశారు.  దాదాపు ఏడుగురుమహిళా రెజర్లను  లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన సుదీర్ఘ పోరాటం చేసిన వినేష్‌ ఫోగట్‌  ఒకరు. అయితే ఆ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ వచ్చారు. (బిల్కిస్‌ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?)

ఇది ఇలా ఉంటే ఇటీవల బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్‌ను ఆ పదవిలో నియమించడం పెద్ద దుమారాన్ని  రేపింది.  దీంతో తమకు న్యాయం జరగలేదంటూ మహిళ రెజర్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు.  ముఖ్యంగా ఈ పోరాటంలో మరో  కీలక రెజ్లర్‌ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే వినేష్ ఫోగట్ ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు.  వీరికి మద్దతుగా  రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే.  (హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!)

 కాగా ఫోగట్ కామన్వెల్త్ , ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన  తొలి భారత మహిళా రెజ్లర్, అలాగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో అనేక  ప తకాలు చాటుకుని భారతీయ సత్తా చాటిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ కూడా.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top