
వేసవికాలం వచ్చిందంటే మండే ఎండలు భయపెడతాయి.మరి భయపెట్టే ఎండల నుంచి రక్షణపొందాలంటూ చల్ల చల్లని ప్రదేశాలు ఎక్కడున్నాయా అని వెదుక్కుంటూ ఉంటారు జనాలు. కూలెస్ట్ డెస్టినేషన్స్ వెదుక్కుంటూ ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే ఈ హడావిడి ఇంకా పెరుగుతుంది.
ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సేద తీరేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. కొద్ది రోజులుగా నగరంలోని జల విహార్‌కు క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో జల విహార్‌కు తాకిడి మరింత పెరిగింది. జలకాలాటలతో జరంత ఉపశమనం పొందారు.


ఆద్యంతం.. ఉత్సాహభరితం..
వాక్ ఏ వే 2.0 కార్యక్రమం ఆదివారం ఆద్యంతం ఉత్సాహభరితంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3 వేల మందికి పైగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆటిజంపై అవగాహన, అంగీకారం, సమగ్ర చేర్పునకు సంఘీభావంగా నిలిచారు. అందరినీ ఒక్కతాటిపై ఉంచి సమాజంలో లోతైన స్ఫూర్తిని నింపింది. మర్హం, రెసొనేటింగ్ రెసిలియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు కుటుంబాలు, నిపుణులు, ఉపాధ్యాయులు, సోషల్ మీడియా స్టార్‌లు, సంస్కరణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీనటి పాయల్ రాధాకృష్ణ, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాణి, టీఎస్‌ఎంసీ అధ్యక్షురాలు డా.ప్రతిభ, డా.మిన్హాజ్, డా.లోకేశ్ ఆర్జే షదాబాద్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు విజయతుపురాణి ఆధ్వర్యంలో ఎనర్జీతో నిండిన డాన్స్‌హిట్ సెషన్, సుధారమణి కథ చెప్పడం, రోహిణి జయంతి చేసిన మనోహరమైన బొమ్మల షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగుల హరివిల్లులా కారి్నవాల్, ఆటలు, సృజన్మాతక స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మర్హం వ్యవస్థాపకుడు డాక్టర్ నవత్ లఖాని మాట్లాడుతూ.. ఎదుగుతున్న పిల్లలకు స్నేహితులు, కుటుంబం మద్దతు ఉంటుందనే భరోసాతో తల్లిదండ్రులు ఉంటారన్నారు. కానీ ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఆ భరోసా సులభంగా లభించదు. సమాజం ముందుకు రావాల్సిన సమయం ఇదేనన్నారు.
