రేపటి నుంచే 'వారాహి గుప్త నవరాత్రులు'.. పూర్తి పూజా విధానం ఇదిగో | Ashadha Varahi Navaratri Celebrations to Begin Tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే 'వారాహి గుప్త నవరాత్రులు'.. పూర్తి పూజా విధానం ఇదిగో

Jul 14 2026 6:48 PM | Updated on Jul 14 2026 7:41 PM

Ashadha Varahi Navaratri Celebrations to Begin Tomorrow

సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు రేపటి నుంచి (జూలై 15, బుధవారం) వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటి నుంచి ప్రారంభమై జూలై 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా సాగనున్నాయి.

లలితా త్రిపురసుందరి దేవి మహా సైన్యాధిపతి అయిన వారాహి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు నిష్ఠతో, గుప్తంగా ఆరాధిస్తే సమస్త నరఘోషలు, శత్రుపీడలు, అప్పుల బాధలు తొలగిపోతాయని దేవీ భాగవతం చెబుతోంది. భక్తులు ఈ పవిత్ర దినాలలో ప్రతిరోజూ పూజ గదిని శుభ్రం చేసుకుని, ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి, అమ్మవారి మూల మంత్రాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన బెల్లం పానకం, శనగలు, పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement