Major Sita Ashok Shelke: వయనాడ్‌ వారియర్‌ | Army Major Sita Shelke whose photos from Kerala Wayanad go viral | Sakshi
Sakshi News home page

Major Sita Ashok Shelke: వయనాడ్‌ వారియర్‌

Aug 4 2024 6:37 AM | Updated on Aug 4 2024 6:37 AM

Army Major Sita Shelke whose photos from Kerala Wayanad go viral

ఐరన్‌ ఉమన్‌

వయనాడ్‌ అనే మాట వినిపించగానే కళ్ల ముందు కన్నీటి సముద్రం కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే సహాయకులకు ప్రకృతి విలయవిధ్వంస దృశ్యాలను చూసి తట్టుకునే గుండెధైర్యంతో ΄ాటు మెరుపు వేగంతో కదిలే శక్తి ఉండాలి. ఆ శక్తి ఆర్మీ మేజర్‌ సీతా అశోక్‌ షెల్కేలో నిండుగా కనిపిస్తుంది. అందుకే... సామాన్య ప్రజల నుంచి రిటైర్డ్‌ ఆర్మీ అధికారుల వరకు సీతను ప్రశంసిస్తున్నారు...

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన చూరల్‌మాల గ్రామంలో కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జి రెయిలింగ్‌పై సగర్వంగా నిలుచున్న మేజర్‌ సీతా షెల్కే ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లింగ వివక్షతను సవాలు చేసి సగర్వంగా వెలుగుతున్న ఫొటో అది.

‘ఇండియన్‌ ఆర్మీ ఇంజనీర్‌లతో కలిసి మేజర్‌ సీత షెల్కే పదహారు గంటలోనే 24 టన్నుల సామర్థ్యం ఉన్న బెయిలీ వంతెనను నిర్మించారు’ అని అభినందిస్తూ ‘ఎక్స్‌’లో ΄ోస్ట్‌ పెట్టారు లెప్టినెంట్‌ కల్నల్‌ జేఎస్‌ సోది(రిటైర్డ్‌). తన కామెంట్‌తో ΄ాటు కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేశాడు.
‘ఒక్క చిత్రం చాలు వంద మాటలు ఎందుకు!’ అన్నట్లు ఈ ఫొటోలలో ఒక్కటి చూసినా చాలు సీత బృందం కష్టం, శక్తిసామర్థ్యాలు తెలుసుకోవడానికి.

ఒకవైపు నేల కూలిన చెట్లు, మరోవైపు అడుగు వేయనివ్వని శి«థిలాలు, వేగంగా ప్రవహిస్తున్న నది, పై నుంచి వర్షం, పరిమిత స్థలం... ఒక్క అనుకూలత కూడా లేని అత్యంత ప్రతికూల పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిట్టూర్చకుండా బ్రిడ్జీ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చేసింది ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన సీత.
సహాయచర్యలు చేపట్టడంలో ఈ బ్రిడ్జి కీలకం కానుంది.
‘ఇది సైన్యం విజయం మాత్రమే కాదు. సహాయకార్యక్రమాల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు, స్థానిక అధికారులు... ఎంతోమంది విజయం’ వినమ్రంగా అంటుంది సీత.

కొండచరియలు విరిగిపడిన చోట పనిచేయడం పెద్ద సవాలు. అక్కడ పురుషులతో సమానంగా పనిచేసింది సీత.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన సీతకు ‘సాహసం’ చిన్నప్పటి నుంచి సన్నిహిత మిత్రురాలు. ఆ ధైర్యమే ఆమెను సైన్యంలోకి తీసుకువచ్చింది.

మద్రాస్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌(ఎంఈజీ) అనేది వంతెనలు నిర్మించడం, మందు΄ాతరలను నిర్వీర్యం చేయడం...ఇలాంటి పనులెన్నో చేస్తుంటుంది. ఈ ఇంజినీరింగ్‌ యూనిట్‌ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే ప్రమాదాల అంచున పనిచేయడం. ఏమాత్రం అప్రమత్తంగా లేక΄ోయినా ్ర΄ాణాలు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ‘మద్రాస్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌’లోని డెబ్బై మంది సభ్యులలో ఏకైక మహిళ సీత. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ అసౌకర్యం అనుకోలేదు. అధైర్య పడి΄ోలేదు.
‘మహిళ కదా... ఇది రిస్క్‌ జాబ్‌ కదా’ అని ఎంతోమంది సీతతో అనేవాళ్లు.

‘రిస్క్‌ లేనిది ఎక్కడా!’ అనేది ఆమె నోటి నుంచి వేగంగా వచ్చే మాట.
‘రిస్క్‌ తీసుకోక ΄ోవడం కూడా పెద్ద రిస్కే’ అనుకునే సీతా అశోక్‌ షెల్కే ఎన్నో రెస్క్యూ ఆపరేషన్‌లలో ధైర్యంగా ΄ాల్గొంది. నిద్ర, తిండి, నీళ్లు.... ఇలాంటివేమీ పట్టించుకోకుండా పనిచేసింది. ‘మగవాళ్లు ఎంత కష్టమైనా పనైనా చేస్తారు. మహిళలకు కష్టం’ అనే మాట ఆమె ముందు నిలిచేది కాదు.
వాయనాడ్‌లో సహాయ, నిర్మాణ కార్యక్రమాలలో తన బృందంతో కలిసి నాన్‌–స్టాప్‌గా పనిచేస్తున్న సీత మోములో అలసట కనిపించదు....రాకెట్‌ వేగంతో పనిచేయాలనే తపన తప్ప. ఆ తపనే ఆమెను అందరూ ప్రశంసించేలా చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement