
సింపుల్ స్టన్నింగ్ బ్యూటీకి నిర్వచనం, నటి అనుపమా పరమేశ్వరన్. ఆమె ధరించే ప్రతి ఔట్‌ఫిట్‌లోనూ ఒక ఫ్యాషన్ ఫ్లో ఉంటుంది. స్టయిలింగ్‌లో సౌకర్యం చూపిస్తూ మెరిసిపోవటమే ఆమె మ్యాజిక్!
అందం అంటే ముఖం కాదు, మూడ్! హ్యాపీగా ఉంటే, ఎప్పుడూ అందంగానే కనిపిస్తాం. అందుకే, నా శరీరానికి నచ్చే, నప్పే దుస్తులనే ఎంచుకుంటాను. వన్ పీస్‌లు, కుర్తీ–జీన్స్ కాంబో, చిన్న స్లీవ్‌ల టాప్స్ నా ఫేవరెట్ ఔట్‌ఫిట్స్. చీరలు అంటే కూడా ఇష్టమే! వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్, హీట్ స్టయిలింగ్ తగ్గించడమే నా కేశ సౌందర్య రహస్యం అంటోంది అనుపమా పరమేశ్వరన్ . ఇక్క అనుపమా జ్యూలరీ బ్రాండ్: షాయా ఇయర్ రింగ్స్ ధర: రూ. 2,500, నెక్ పీస్ ధర: రూ. 7,800, డ్రెస్..రూ.98,800
చెవితో మాట్లాడే చెయిన్!
చెవికి పెట్టే ఈ చిన్న చెయిన్, మొత్తం మీ స్టయిల్‌నే చేంజ్ చేసేస్తుంది. ఒక్కసారి ఈ చెయిన్ చెవిలో కనిపిస్తే, ఆ తర్వాత అది చూసిన ప్రతి ఒక్కరి చెవిలోనూ అలాంటిదే దర్శనమిస్తుంది. అదే ఈ ‘చెయిన్‌డ్ ఇయర్ కఫ్’ మ్యాజిక్! పాత రోజుల్లో ఇది పంక్ స్టయిల్‌కి గుర్తుగా ఉండేది. కాని, ఇప్పుడు ఇది మోడ్రన్ ట్రెండ్ ఐకాన్. చెవిని నగల దుకాణంలా కాకుండా, మినిమలిస్టిక్‌గా చూపించాలంటే ఇదే బెస్ట్ చాయిస్.
హెయిర్ స్టయిల్ విషయంలో హై పోనీ, స్లీక్ బ లేదా బ్రెయిడ్ బెస్ట్. ఎందుకంటే ఈ ఇయర్‌కఫ్ వేసుకున్నాక దాన్ని దాచడం, బ్యాడ్ టేస్ట్! చెవిని పూర్తిగా కనిపించేలా ఉంచాలి. వెస్ట్రన్ డ్రెస్సులు, ఫ్యూజన్ లెహంగాలు, కుర్తాలకు సూపర్ మ్యాచ్ అవుతుంది. చీరకైనా సరే, బ్లౌజ్ నెక్ డిజైన్లు ఆఫ్–షోల్డర్, స్వీట్‌హార్ట్, బోట్‌నెక్, సింగిల్ షోల్డర్ స్టయిల్స్‌తో ఉంటే గ్లామర్ డబుల్ అవుతుంది. ఫొటోషూట్స్, సంగీత్, కాక్‌టెయిల్ పార్టీలు, బ్రాంచ్ డేట్స్‌కు బెస్ట్. ఒక్కసారి ఈ చెయిన్డ్ ఇయర్‌కఫ్ వేసుకుంటే, అదే మీ ఫ్యాషన్ స్టేట్‌మెంట్ అవుతుంది!.
(చదవండి: పార్లమెంటు క్యాంటీన్‌లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!)