తీపి రికార్డు! ‘ఇంత తేనె ఎలా తిన్నాడు?' | Andre Ortolf's World Record For Eating Honey | Sakshi
Sakshi News home page

తీపి రికార్డు! ‘ఇంత తేనె ఎలా తిన్నాడు?'

Jun 28 2026 9:41 AM | Updated on Jun 28 2026 10:29 AM

Andre Ortolf's World Record For Eating Honey

ఫండే

తేనె అంటే చాలామందికి ఇష్టం. కానీ, జర్మనీకి చెందిన ఆండ్రే ఆర్టోల్ఫ్‌ మాత్రం పిచ్చి! ఎంతంటే, ఒక నిమిషంలో ఏకంగా కిలోకు పైగా తేనె తినేసేంత.

అవును, ప్రపంచ రికార్డు కోసం బకెట్‌ నిండా తేనె ముందు పెట్టుకుని కేవలం 60 సెకన్లలోనే 1,273 గ్రాముల తేనెను గుటకలేసేశాడు. అంటే దాదాపు ఒక పెద్ద తేనె సీసా మొత్తాన్ని నిమిషంలో ఖాళీ చేశాడు. నీళ్లు తాగినట్టు తేనె తాగడం అంత ఈజీ కాదు. అది చిక్కగా ఉండటంతో గొంతులోకి వెళ్లడమే పెద్ద టాస్క్‌.

అయినా ఆండ్రే మాత్రం స్పూన్‌  తర్వాత స్పూన్‌  వేగంగా తింటూ కొత్త ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వైరల్‌ అవుతోన్న అతని వీడియో చూస్తే ‘ఇంత తేనె ఎలా తిన్నాడు?‘ అనిపించక మానదు. అయితే ఇది ఒక్కరోజులో వచ్చిన విజయం కాదు. విచిత్రమైన తినే చాలెంజ్‌లలో ఇప్పటికే అనుభవం ఉన్న ఆండ్రే, తన వేగం, పట్టుదలతో మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement