'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..! | Anand Mahindra calls Honnavar Karnataka magical underexplored destination | Sakshi
Sakshi News home page

'హొన్నావర్' అందానికి జయహో అనాల్సిందే..! ఆనంద్‌ మహీంద్రా సైతం ఫిదా

Jun 15 2026 11:38 AM | Updated on Jun 15 2026 12:21 PM

Anand Mahindra calls Honnavar Karnataka magical underexplored destination

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ మంచి స్ఫూర్తిదాయకమైన కథలను, కమనీయ ప్రదేశాల గురించి షేర్‌ చేస్తూ ఉంటారు. అలానే ఈసారి ప్రకృతి రమ్యతకు, నిశబ్దమైన గంభీరతకు ఆలవాలమైన ఒక కమనీయ ప్రదేశం ఫోటోలను షేర్‌చేస్తూ..దాని గురించి రాసుకొచ్చారు. అంతగా చూడని, గమనించని అందమైన ప్రదేశం అంటూ..ఆ పర్యాటక అందాల గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇంతకీ ఆ పర్యాటక ప్రదేశం ఎక్కడ ఉందంటే..

కర్ణాటక తీరప్రాంతంలోని హొన్నవార్‌ అందాలకు ఫిదా అవ్వుతూ దాని గొప్పతనం గురించి సోషల్‌ మీడియా ఎక్స్‌లో రాసుకొచ్చారు ఆనంద్‌ మహీంద్రా. శ్రద్ధ అనే పదానికి అర్హమైన అపురూపమైన ప్రకృతి రత్నంగా అభివర్ణించారు. తాను ప్రజలు అంతగా అన్వేషించని, రద్దీ తక్కువగా ఉండే ప్రశాంతమైన ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నానంటూ రాశారు. 

అంతా కేరళ బ్యాక్‌వాటర్స్‌(బ్యాక్ వాటర్స్ (Backwaters) అనగా నదులు, సరస్సులు లేదా సముద్రపు తీరాలకు సమీపంలో నీటి ప్రవాహం మందగించడం వల్ల ఏర్పడే నిశ్చలమైన జలాలు. )ని ప్రశంసిస్తుంటాం. కానీ కర్ణాటక తీరంలో అలాంటి బ్యాక్‌వాటర్‌కి సంబంధించిన అద్భుతమైన ప్రదేశం ఒకటి ఉందని అన్నారు. 

జోగ్‌జలపాతంపై ఘోషించే శరావతి నది చివరకు  హొన్నవార్ వద్ద నిశ్శబ్దంగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇదోక మాయ ప్రదేశం. మడ అవడవులు, వంకరటింకరగా ప్రవహించే జలమార్గాలు, అద్దంలాంటి బ్యాక్‌వాటర్స్‌, ఎవ్వరినైన కట్టిపడేస్తాయని అన్నారు. మడ అడవులు ప్రకృతి అత్యంత సమర్థవంతమైన తీర రక్షకులలో ఒకటి కాబట్టి..హోన్నవార్‌ అందానికి పర్యావరణ ప్రాముఖ్యత కూడా తోడైన రమ్యమైన ప్రదేశంలా ఉంటుంది అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌చేశారు. 

అందుకు నెటిజన్లు కూడా మద్దతిస్తూ..తమకు లిసిన తెలిసిన అద్భుత పర్యాటక ప్రదేశాల గురించి పంచుకున్నారు. కొందరు కేరళ తరచుగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, కానీ భారతదేశ తీరప్రాంతం దాగి ఉన్న అద్భుత కళాఖండాలతో నిండి ఉంది. అసాధారణంగా ఉండటానికి అందానికి జనసమూహం అవసరం లేదని మనకు గుర్తుచేసే ప్రదేశాలలో హొన్నవార్ ఒకటిగా కనిపిస్తుంది.

 

(చదవండి: ఆక్వా కలర్‌ బనారసీ చీరలో నీతా అంబానీ అందమైన లుక్‌..! తయారీకే ఏకంగా..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement