మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మోటార్‌ సైకిళ్ల దొంగ అరెస్ట్‌

Sep 28 2026 1:11 AM | Updated on Sep 28 2026 1:11 AM

భీమవరం: మోటార్‌సైకిళ్ల చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం తణుకు చెందిన తలకొక్కుల నవీన్‌ ప్రేమ్‌ హైదరాబాద్‌లో డ్రైవింగ్‌ పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు లోనై మోటార్‌ సైకిళ్ల చోరీకి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో లంకపేట రైల్వే అండర్‌పాస్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన బైకులను అండర్‌పాస్‌ సమీపంలోని తుప్పల్లో దాచినట్లు నిందితుడు విచారణలో తెలపడంతో, అతడు చూపించిన ప్రదేశం నుంచి 5 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో... ఏపీ 39 ఈఎన్‌ 2160 (సుజుకి యాక్సెస్‌), ఏపీ 39 క్యూఈ 0116 (వెస్పా), ఏపీ 40 కేక్యూ 5098 (అప్రిలియా ఎస్‌ఆర్‌–125), ఏపీ 37 సీఎల్‌ 8651 (హోండా సీబీ యూనికార్న్‌), ఏపీ 37 డీహెచ్‌ 6166 (హోండా యాక్టివా – వైట్‌) ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement