వ్యాను, బస్సు ఢీకొని ఏడుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వ్యాను, బస్సు ఢీకొని ఏడుగురికి గాయాలు

Sep 28 2026 1:11 AM | Updated on Sep 28 2026 1:11 AM

వ్యాను, బస్సు ఢీకొని ఏడుగురికి గాయాలు

ఉంగుటూరు: జాతీయ రహదారికి కూతవేటు దూరంలో బాదంపూడి వై జంక్షన్‌ వద్ద స్టేట్‌ హైవేపై ఆదివారం మధ్యాహ్నం ఆర్‌టీసీ బస్సు – చేపల వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఉంగుటూరు, కొత్తగూడెంలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులందరూ వ్యానులో ఉన్నవారే. విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్‌టీసీ బస్సు, తాడేపల్లిగూడెం నుంచి ఉంగుటూరు వైపు వస్తున్న చేపల వ్యాను అక్కడ ఉన్న మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో చేపల వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాను, బస్సు ముందు భాగాలు దెబ్బతిన్నాయి. గాయపడిన వారిలో కొత్తగూడెం గ్రామానికి చెందిన కె. యేసు (33), ఎ. దేవదాసు (50), ఉంగుటూరు గ్రామానికి చెందిన ఎ. శ్రీనివాసు (50), రాంబాబు (44), జి. శివ (38), సీహెచ్‌. త్రిమూర్తులు (42), అలాగే శింగరాజుపాలెం గ్రామానికి చెందిన సాయికుమార్‌ (28) ఉన్నారు. వీరందరికీ ప్రాణాపాయం లేదని, అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడ చికిత్స పొందుతున్నారు. చేబ్రోలు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement