పెద్దింట్లమ్మా.. పాహిమాం | - | Sakshi
Sakshi News home page

పెద్దింట్లమ్మా.. పాహిమాం

Sep 28 2026 1:11 AM | Updated on Sep 28 2026 1:11 AM

పెద్దింట్లమ్మా.. పాహిమాం పోటెత్తిన భక్తులు జిల్లా జట్ల ఎంపిక వృద్ధుడి అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

కైకలూరు: అమ్మా పెద్దింట్లమ్మా.. మాపై నీ కరుణ చూపవమ్మా.. అంటూ ఆర్తితో అమ్మను భక్తులు వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి వందలాది మంది ఆదివారం దర్శించుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షణలు అనంతరం వేడినైవేద్యాలను సమర్పించారు. మహిళలు భక్తితో పాలపొంగళ్లు అందించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.42,565 ఆదాయం లభించిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు.

ముదినేపల్లి రూరల్‌: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం – చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయంలోని పుట్టలో పాలు పోసి, స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు పాలపొంగళ్ల శాల వద్ద నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద, గోశాలలోని గోవులకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో, ఆలయ సహాయ కమిషనర్‌ ఆర్‌. గంగాశ్రీదేవి, చైర్మన్‌ బొంగు రవికుమార్‌, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.

పెదవేగి: నిరంతర సాధన, క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉంటేనే విద్యార్థులలోని ప్రతిభ మెరుగుపడుతుందని పెదవేగి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్‌ ఎం. రమేష్‌ బాబు అన్నారు. స్థానిక గురుకుల విద్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్‌–19 బాలుర జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్‌, ఖో–ఖో, యోగాతో పాటు బాలుర, బాలికల విభాగాలలో చెస్‌ జట్లను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎంపిక చేశారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం. రమేష్‌ బాబు, అండర్‌–19 ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కందికొండ జయరాజు, పీడీలు రాజ్యలక్ష్మి, కుమార్‌, తారక, రాజకుమారి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని జట్ల ఎంపిక ప్రక్రియలో తమ వంతు సహాయ సహకారాలు అందించారు.

ఉంగుటూరు: చేబ్రోలు గ్రామానికి చెందిన కడియాల సత్యనారాయణ (89) అనారోగ్యంతో ఇంటి వద్దనే మృతి చెందారు. అయితే, ఆయన మృతిపై అనుమానాలున్నాయని సత్యనారాయణ భార్య మేనల్లుడైన వల్లూరి దుర్గప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement