బీసీల సత్తాచాటాలి
బీసీల ఐక్యతకు నిదర్శనం
జగన్ హయాంలో పెద్దపీట
బీసీ గర్జనలో తీర్మానాలు
రజకులకు వంచన
సంచార జాతులకు జగన్‌తోనే గుర్తింపు
సాక్షి, రాజమహేంద్రవరం / రాజమహేంద్రవరం రూరల్ / ధవళేశ్వరం : ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని.. అధికారంలోకి వచ్చాక నిలువునా మోసం చేసిన వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీలు గర్జించారు. జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్నా ఇప్పటికీ కులవృత్తిదారులుగానే చంద్రబాబు చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా చిన్నచూపు చూస్తున్నాడని మండిపడ్డారు. నా బీసీలు అని చెప్పే దమ్మున్న జగన్ మళ్లీ గెలిస్తేనే బీసీలకు మంచి రోజులొ స్తాయని.. అందుకోసం అందరం ఐక్యంగా ముందుకు సాగుదామని ప్రతినబూనారు. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీల గర్జన సదస్సు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అ ధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన కాతేరులో ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు, విడదల రజని, జోగి రమేష్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు పిల్లి సూర్యప్రకాష్, గుడాల గోపి, వివిధ జిల్లాల బీసీ సెల్ అధ్యక్షులు అల్లి రాజబాబు, మట్టపర్తి నాగేంద్ర, నెరుసు చిరంజీవులు, శివకుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొ డవడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఓట్లు వేసిన బీసీలంతా చంద్రబాబు పా లనను చూసి కన్నీళ్లు తెచ్చుకుంటున్నారు. 2029లో వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రిని చేసేందుకు బీసీలంతా తమ సత్తా చాటాలి.
– నవుడు వెంకటరమణ, రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్
కాతేరు వేదికగా బీసీ గర్జన విజయవంతం కావడం బీసీల ఐక్యతకు నిదర్శనం. ఇదే స్ఫూర్తితో బీసీ నేతలంతా వైఎస్ జగన్ చేసిన మేలు, వెన్నుపోటు పార్టీ నా యకుడు చంద్రబాబు మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలి.
– కవురు శ్రీనివాస్, ఎమ్మెల్సీ
వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశారు. ముగ్గురు బీసీలను ముఖ్యమంత్రులను చేశారు. నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించారు. వెన్నుపోటు పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటోంది. చంద్రబాబు మోసాలను పార్టీ శ్రేణులంతా గ్రామస్థాయిలో వివరించాలి.
– మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్సీ
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టం చేయాలి.
తక్షణమే ఉప ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వాలి.
ఆదరణ పథకం పేరుతో బడ్జెట్‌లలో కేటాయించిన రూ.3 వేల కోట్లతో తక్షణమే పనిముట్లు ఇవ్వాలి.
50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4 వేల పింఛన్ మంజూరు చేయాలి.
ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు రూ.9 వేల కోట్లు విడుదల చేయాలి.
రైతులకు ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలి.
18–60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 హామీ వెంటనే అమలు చేయాలి.
ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి.
వెన్నుపోటు పార్టీ అరాచకాలను ప్రశ్నిస్తున్న బీసీ నేతలపై కేసులు, వేధింపులు తక్షణమే ఆపాలి.
బీసీలకు 150 రోజులపాటు ఉపాధి హామీ పథకం అమలు చేయాలి.
చట్టసభల్లో రాజ్యాధికారం కోసం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
బీసీ కార్పొరేషన్ రుణాల కోసం 3 లక్షల అప్లికేషన్లు రాగా తక్షణమే రుణాలు మంజూరు చేయాలి.
చంద్రబాబు ఎన్నికల ముందు రజకులను ఎస్సీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక రజకులకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు చంద్రబాబు హామీలను రజకులు నమ్మే పరిస్థితి లేదు. 2029లో రజకులంతా వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తాం.
– గంధం రవి, పశ్చిమగోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు
రాజకీయ ప్రాధాన్యం లేని సంచారజాతులను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. సొంత ఇల్లు లేని తనను చైర్మన్ చేయడంతోపాటు ఆయన పక్కన కూ ర్చోబెట్టుకున్న మహోన్నత వ్యక్తి జగన్. కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా చైర్మన్‌ను నియమించకపోవడం దారుణం. సంచారజాతుల పిల్లలు జగన్ పథకాలతో లబ్ధి పొందారు.
– పెండ్ర వీరన్న, రాష్ట్ర వెనుకబడిన సంచార జాతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్
ఎన్నికల వేళ ఓటు బ్యాంకుగానే చూస్తునారు
రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో చిన్నచూపు
వైఎస్ జగనతోనే బలహీన వర్గాల సంక్షేమం సాధ్యం
వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జనలో వైఎస్సార్ సీపీ నాయకులు


