మహిళా చైతన్యంతో సాధికారత | - | Sakshi
Sakshi News home page

మహిళా చైతన్యంతో సాధికారత

Sep 28 2026 1:11 AM | Updated on Sep 28 2026 1:11 AM

మహిళా చైతన్యంతో సాధికారత నేడు డీసీఎంఎస్‌ మహాజన సభ పర్యాటకాభివృద్ధికి చర్యలు లాయర్స్‌ సంఘ ఎన్నిక

ద్వారకాతిరుమల: మహిళలు చైతన్యవంతులైనప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) జిల్లా మహిళా సదస్సు ఆదివారం ద్వారకాతిరుమలలోని యూటీఎఫ్‌ భవనంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే చైతన్యం, పోరాట స్ఫూర్తి అవసరమన్నారు. స్టేట్‌ ఆడిట్‌ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బీఆర్‌ క్రాంతికుమారి మాట్లాడుతూ మహిళలు ఏ స్థాయిలో ఉన్నా కొన్ని ఇబ్బందులు తప్పవని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. యూ టీఎఫ్‌ సహాధ్యక్షురాలు ఏఏన్‌ కుసుమకుమారి, రాష్ట్ర ఐద్వా ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి, మరో రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి తదితరులు మా ట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ రుద్రాక్షి, సీనియర్‌ ఉపాధ్యాయులు సీ హెచ్‌ జగన్మోహనరావు, గంగరాజు, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు జి.దేవానందరావు, రాంబాబు, శ్రీధర్‌, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.జయరాజు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగో దావరి జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ మహాజన సభ సోమవారం నిర్వహించనున్న ట్టు ఆ సంస్థ బిజినెస్‌ మేనేజర్‌ ప్రకటనలో తెలిపారు. ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లోని డీసీఎంఎస్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌ హాల్లో సోమవారం ఉదయం 11.30 గంటలకు మహాజన సభ ప్రారంభమౌతుందని పేర్కొన్నారు.

ద్వారకాతిరుమల : జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించు కుని ద్వారకాతిరుమలలోని ఏపీ టూరిజం (హరిత) హోటల్‌లో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని ప్ర ముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను అనుసంధానం చే స్తూ టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో పర్యాటకులకు మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నా రు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జేసీ మొక్కలు నాటారు. జిల్లాలోని ప్రము ఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల వివరాలతో రూపొందించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ ని ర్వహించారు. సెట్‌వెల్‌ సీఈఓ కేఎస్‌ ప్రభాకర్‌, పర్యాటక శాఖ జిల్లా మేనేజర్‌ పట్టాభి రామన్న, తహసీల్దార్‌ జేవీ సుబ్బారావు, శ్రీవారి దేవస్థానం డీఈఓ వై.భద్రాజీ, ఏఈ వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

భీమవరం: ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ఉభయగోదావరి జిల్లాల నూతన అ ధ్యక్ష, కార్యదర్శులుగా పుట్టా వేణుగోపాలచౌదరి, కామన మునిస్వామి ఎన్నికయ్యారు. ఆ దివారం భీమవరంలో సంఘ మహాసభ నిర్వహించారు. నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు గా దిగుపాటి రాజగోపాల్‌, మేక ఈశ్వరయ్య, కౌరు వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులుగా రామాని కాస్ట్రో, పి.శ్రీనివాసు, పీవీపీ లక్ష్మి, కో శాధికారిగా కట్టా సత్యనారాయణ, 12 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రభుత్వం న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు, జూనియర్‌ న్యాయవాదులకు రూ. 10 వేలకు ఉపకార వేతనం పెంచాలని తీర్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement