గోదావరికి మళ్లీ వరద | - | Sakshi
Sakshi News home page

గోదావరికి మళ్లీ వరద

Sep 28 2026 1:11 AM | Updated on Sep 28 2026 1:11 AM

● నీటమునిగిన ఎద్దెలవాగు వంతెన

● జలదిగ్బంధంలో 16 గ్రామాలు

వేలేరుపాడు: గోదావరికి మళ్లీ మూడోసారి వరద పోటెత్తింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు క్రమేపీ గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి గోదావరి నీటిమట్టం 43.20 అడుగులకు చేరుకుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వేలేరుపాడు మండలంలో దిగువ ప్రాంతంలోని ఎద్దెలవాగు వంతెన శుక్రవారం నీట మునిగింది. దీంతో దిగువ ఉన్న 16 గిరిజన గ్రామాలు మూడో రోజు కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దిగువన ఉన్న కొయిదా, కట్కూరు, టేకుపల్లి, కాకిస్‌నూ రు, పేరంటపల్లి, కాచారం, టేకూరు, బుర్రెడ్డిగూడెం, సిద్దారం, కుంకుడు కొయ్యలపాకలు, ఎడవల్లి, చిట్టంరెడ్డిపాలెం, ఎర్రతోగు, చిన్నమంకోలు, పూసుగొంది, తాళ్లగొంది తదితర బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎద్దెలవాగు వద్ద అధికారులు నాటు పడవను ఏర్పాటుచేశారు. వేలేరుపాడు నుండి రుద్రమకోట వెళ్లే రహదారిలో పెద్దవాగు వంతెనకు చేరువలో రహదారి ఆదివారం నీట మునిగింది. దీంతో రుద్రమకోట గ్రామస్తులు పడవపై దాటుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement