పాల నురుగులా పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

పాల నురుగులా పరవళ్లు

Sep 28 2026 1:11 AM | Updated on Sep 28 2026 1:11 AM

పాల నురుగులా పరవళ్లు వారెవ్వా.. వాటర్‌ఫాల్స్‌

వారెవ్వా.. వాటర్‌ఫాల్స్‌

భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతంలోని జలపా తాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బుట్టాయగూ డెం మండలం మారుమూల గ్రామమైన ముంజులూరు సమీపంలోని జలపాతం, కన్నారపాడు సమీపంలోని జలపాతం, పాపికొండల అభయారణ్యంలోని ఉన్న జలతార వాగు, గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. అలాగే ఉప్పరిల్ల, చింతకొండ, జారుడు కాల్వ, కొవ్వాడ కాల్వ, రేగులపాడు సమీపంలోని కాల్వలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలపాతాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement