చింతూరు: మేనత్త కొ డుకును కాపాడిన ఓ యువకుడు తరువాత వాగు ఉధృతికి గల్లంతైన ఘటన ఘాట్‌రోడ్‌లోని సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని చిన్నపేటకు చెందిన బుంగా బాల వందనం (18) డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. విహారయాత్రకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం అదే జిల్లాలోని కోలమూరులో అ మ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడినుంచి బంధువులతో కలిసి 20 మంది వరకు విహారయాత్ర నిమిత్తం ఆదివారం ఉదయం బస్సులో మారేడుమిల్లి వచ్చారు. అక్కడి నుంచి చింతూరు, మారేడుమిల్లి ఘాట్‌రోడ్‌లోని తులసిపాక సమీపంలో గల సోకిలేరు వ్యూ పాయింట్ వద్దకు చేరుకున్నారు. బాలవందనంతో పాటు మేనత్త కొడుకు వుచ్చుల శ్యామ్ (8), మరో ఇద్దరు కలిసి స్నానాల నిమిత్తం వాగులోకి దిగారు. ఈ క్రమంలో శ్యామ్ ప్రమాదవశాత్తు నీటిలో జారి కొట్టుకుపోతుండగా అతడిని కాపాడేందుకు బాలవంద నం కూడా నీటిలోకి దూకాడు. ఇటీవల కురిసిన వ ర్షాలకు నీటి ఉధృతి అధికంగా ఉండటంతో వారిద్దరు కొంతదూరం నీటిలో కొట్టుకెళ్లిన అనంతరం బాలవందనం శ్యామ్‌ను పక్కనే వున్న రాయిపైకి తోయడంతో బాలుడు ప్రాణా లతో బయటపడ్డాడు. బాలవందనం మాత్రం గల్లంతయ్యాడు. గాలింపు చేపట్టినా బాల వందనం ఆచూకీ లభించలేదు.
భీమవరంలో విషాదఛాయలు
భీమవరం : బాల వందనం గల్లంతుతో భీమవరంచినపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. చినపేటకు చెందిన చికిలేవారి వీధిలో నివాసం ఉంటున్న సుందర ప్రకాష్ కుమారుడు బాలానందం. సుందర ప్రకాష్ కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.


