సామాన్యుడిపై ధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడిపై ధరాఘాతం

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

సామాన్యుడిపై ధరాఘాతం

ఆరు నెలలుగా నిత్యావసరాల ధరల్లో మార్పులు (కిలో రూ.లలో)

బతుకు భారం

వంట కష్టమవుతోంది

● భగ్గుమంటున్న నిత్యావసరాలు

● బెంబేలెత్తుతున్న సామాన్యుడు

● ధరలను అదుపు చేయని

కూటమి ప్రభుత్వం

కై కలూరు: పచ్చని పొలాలు, పాడిపంటలతో కళకళలాడే గ్రామాలు నేడు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి ఖర్చుకు ఏ మాత్రం సంబంధం ఉండడం లేదు. ఆరు నెలలగా రేట్లు గమనిస్తే సన్‌ ఫ్లవర్‌ నూనె రూ.165 నుంచి రూ.180కి ఎగబాకింది. రూ.45 ఉండే ఉల్లిపాయలు రూ.65కి చేరాయి. లలితా బ్రాండ్‌ బియ్యం గతంలో రూ.1,500 ఉండగా నేడు రూ.1,750కి చేరింది. గతంలో రూ.300కి కూరగాయలు వచ్చేవి. నేడు రూ.550 ఖర్చు అవుతుంది. మార్కెట్‌కు వెళ్తే సంచి నిండడం లేదు కానీ జేబు మాత్రం క్షణాల్లో ఖాళీ అవుతోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

చితికిపోతున్న చిరుద్యోగులు

ధరల పెరుగుదల ప్రభావం చిరుద్యోగులపై పడింది. నెలకు రూ.20 వేల స్థిరవేతనం పొందే భార్య, ద్దరు సంతానం కలిగిన ప్రైవేటు ఉద్యోగి జీవన పరిస్థితి గమనిస్తే ఇంటి అద్దె రూ.7 వేలు, నిత్యవసరాలు, కూరగాయలు ఖర్చు మరో రూ.7 వేలు, విద్యుత్‌, గ్యాస్‌ సిలిండర్‌, నీరు రూ.2 వేలు, పిల్లల చదవులు రూ.3 వేలు, పెట్రోలు, ప్రయాణ ఖర్చులు రూ.2 వేలు కలుపుకుని రూ.21 వేలు ఖర్చవుతుంది. ఇక ఇంట్లో ఎవరికై నా అనారోగ్యం వస్తే ఆస్పత్రి ఖర్చుల కోసం తక్షణమే అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఎల్‌నినో పేరుతో..

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రజలు ఎక్కువగా వరిసాగు, ఆక్వారంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆక్వా మేతల ధరలు పెరగడంతో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తున్నారు. మరోవైపు అనేక మండలాల్లో సాగునీరు అందక రైతులు గగ్గోలు పెడుతుంటే, ధరల పెరుగుదలకు ఎల్‌నినో ప్రభావమే కారణమంటూ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పడమే తప్ప ఆచరణలో కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. వెంటనే రైతుబజార్ల ద్వారా నిత్యావసరాలను సబ్సిడీపై సరఫరా చేసి ఆదుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

’శ్రీను ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్‌. భార్య, ఇరువురు సంతానం. నెలకు రూ.15,000 సంపాదిస్తున్నాడు. ఇంట్లో ఖర్చులు, పిల్లల స్కూల్‌ ఫీజులు.. అన్నీ కలిపి ఖర్చు చేయగా ఇంకా రూ.10,000 బయట వడ్డీకి అప్పు చేయాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి దాదాపు అన్ని కుటుంబాల్లో ప్రస్తుతం కనిపిస్తోంది.’

‘కల్యాణి ఓ సాధారణ గృహిణి. భర్త దినసరి కూలీ. ఇద్దరు పిల్లల కాలేజీ చదువులు. భర్త నెలకు రూ.18,000 సంపాదిస్తాడు. గతంలో వారానికి రెండు సార్లు చికెన్‌ తెచ్చుకునేవాళ్లు. ఇప్పుడు కోడిగుడ్లతోనే సరిపెట్టుకుంటున్నారు. అప్పుల తిప్పలు చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు చక్కెర వ్యాధి మందులు చుక్కలు చూపిస్తున్నాయి.’

రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో నాలాంటి ఆటో డ్రైవర్లు బతకడం కష్టంగా మారింది. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము చాలడం లేదు. ఉచిత బస్సు దెబ్బతో ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గింది. పెరుగుతున్న ధరలతో పూట గడవడమే కష్టంగా ఉంది. ధరలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– మన్నెం నాగేశ్వరరావు, ఆటో డ్రైవర్‌, ముదినేపల్లి

నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిపాయలు, వంట నూనె, కందిపప్పు ఇలా అన్ని ధరలు పెరిగాయి. పరిమిత బడ్జెట్‌తో వంటలు చేయడం కష్టమే. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. ఎంతో మంది గృహిణులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం పెరిగిన రేట్లను సవరించి, సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలి.

– పసుపులేటి లక్ష్మి, గృహిణి, మండవల్లి

సరుకులు పూర్వం ప్రస్తుతం

సన్‌ ఫ్లవర్‌ నూనె రూ.165 రూ.180

కందిపప్పు రూ.110 రూ.130

ఉల్లిపాయలు రూ.45 రూ.65

సరుకులు పూర్వం ప్రస్తుతం

టమాట రూ.24 రూ.32

గ్యాస్‌ సిలిండర్‌ రూ.936.50 రూ.983.53

బియ్యం (26కేజీలు) రూ.1,500 రూ.1,750

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement