ముమ్మరంగా పొగాకు కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా పొగాకు కొనుగోళ్లు

Sep 26 2026 12:44 AM | Updated on Sep 26 2026 12:44 AM

ముమ్మరంగా పొగాకు కొనుగోళ్లు 28న స్కూల్‌గేమ్స్‌ సెలెక్షన్స్‌ 28న అండర్‌–19 బాలికల పోటీలు

కొయ్యలగూడెం: వర్జీనియా పొగాకు కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు 6.5 మిలియన్ల కిలోల పొగాకును కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణ అధికారి శివకుమార్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. మొత్తం 67,19,571 కిలోల పొగాకును రూ. 1,73,96,19,965 లకు కొనుగోలు చేశామన్నారు. మొత్తం 18.5 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తికి రైతులకు అనుమతి ఇవ్వగా, ఇప్పటివరకు 137 పని దినాల్లో ఈ కొనుగోళ్లు నిర్వహించామన్నారు. మార్కెట్‌లో అత్యధిక ధర రూ.345 పలకగా, కనిష్టంగా రూ. 150 నమోదైంది. సగటున రూ. 259 చొప్పున పొగాకును కొనుగోలు చేశారు. గత మూడేళ్లుగా సీజన్‌ చివర్లో మార్కెట్‌ ధరలు పెరుగుతుండటంతో, ఈసారి కూడా ధర పెరుగుతుందనే ఆశతో రైతులు తమ వద్ద ఉన్న పొగాకును నిల్వ చేసుకుంటున్నారని, దీంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో 2027 జనవరిలో కూడా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందన్నారు.

వీరవాసరం: 2026–27 విద్యా సంవత్సరానికి పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు జరగనున్నాయి. అండర్‌–14, అండర్‌–17 బాలబాలికల టేబుల్‌ టెన్నిస్‌, మాల్కంబ్‌ జట్ల ఎంపికను ఈ నెల 28న చింతలపాటి బాపిరాజు మున్సిపల్‌ హైస్కూల్లో నిర్వహించనున్నట్లు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శులు నర్మదా, కుద్దూస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌–14 విభాగంలో పాల్గొనేవారు 01.01.2013 తర్వాత, అండర్‌–17 విభాగంలో పాల్గొనేవారు 01.01.2010 తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తమ ఆధార్‌ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 9885158366 నంబరును సంప్రదించాలని సూచించారు.

పెదవేగి: ఏలూరులోని సెయింట్‌ థెరిస్సా జూనియర్‌ కళాశాలలో ఈ నెల 28న అండర్‌–19 బాలికల వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ గురుకుల కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ కందికొండ జయరాజు శుక్రవారం పెదవేగిలో వివరాలు వెల్లడించారు. అలాగే వచ్చే నెల 3న పెదవేగి గురుకుల పాఠశాలలో బాలబాలికల ఫుట్‌బాల్‌, బాలుర హ్యాండ్‌బాల్‌ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement