చిన వెంకన్న క్షేత్ర ధర్మకర్తల మండలి సమావేశం
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంలో భక్తుల సౌకర్యాలు, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధికి ధర్మకర్తల మండలి ఆమోద ముద్ర వేసింది. దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. అభివృద్ధి పనులు, టెండర్లు, అంచనాలు, లైసైన్స్ హక్కులకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. సమావేశ వివరాలను ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు విలేకర్లకు వెల్లడించారు.


