వాగుల వద్ద అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

వాగుల వద్ద అప్రమత్తం

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

వాగుల వద్ద అప్రమత్తం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ప్రజలు వాగులను దాటకుండా ముందస్తు జాగ్రత్తగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం వరద జాగ్రత్త చర్యలపై టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వాగులు దాటకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. అలాగే ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలు, డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కూలిన విద్యుత్‌ స్తంభాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. మండల, డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement