తూర్పుకాల్వలో కొట్టుకుపోయిన గిరిజనుడు | - | Sakshi
Sakshi News home page

తూర్పుకాల్వలో కొట్టుకుపోయిన గిరిజనుడు

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

బుట్టాయగూడెం: కోటరామచంద్రాపురం తూర్పుకాల్వలో గురువారం రాత్రి పూనెం భాస్కరరావు అనే గిరిజనుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కేఆర్‌పురం సచివాలయం ప్రాంతంలో నివసిస్తున్న భాస్కరరావు కోడి మాంసం కోసం వాగుకు అవతలి వైపు ఉన్న దుకాణం దగ్గరకు వచ్చి మాంసం తీసుకుని తిరిగి తన ఇంటికి వెళ్తుండగా వాగు మరింత ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో భాస్కరరావు వాగులో దిగి ఒడ్డుకు చేరే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు దిగొద్దని చెప్పినా మొండిగా వాగు దాటే ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు మాజీ సర్పంచ్‌ ఉయికే బొజ్జిదొర తెలిపారు. ఎస్సై చెన్నారావు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో రాత్రి 11 గంటల వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. ఓ పక్క భారీ వర్షం, వాగు ఉధృతంగా ప్రవహించడంతో భాస్కరావు ఆచూకీ లభించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement