● పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
నూజివీడు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) దిశానిర్దేశం చేశారు. నూజివీడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పట్టణంలోని కృష్ణవిలాస్ కల్యాణమండపంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎన్నార్ మా ట్లాడుతూ ఎన్నికల ముందు మాయమాటలు, అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన వెన్నుపో టు పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలను నిండా ముంచారన్నారు. ఇచ్చిన హామీల్లో అమలు చేస్తున్నవి ఒకటి రెండు తప్ప మిగిలిన వాటన్నింటినీ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. 27 నెలల కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఒక్క మహిళకి కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని వారిని మోసం చేసిందన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చెస్తానని చెప్పిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత అప్పులు చేసే పనిలోనే ఉండి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాడన్నారు. ఈ ఊబిలో నుంచి రాష్ట్రం బయటపడటం కష్టమేనన్నారు. ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజల్లోకి తీ సుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలల్లో అందరూ సంఘటితంగా పనిచేయాలని, గెలుపు గుర్రాలను నిలబెట్టి గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయాలన్నారు.
ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న కూటమి
మాజీ ఎమ్మెల్యే, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ నూజివీడు మున్సిపాలిటీని ఇప్పటివరకు తన సారథ్యంలో ఐదుసార్లు గెలుపొందామని, ఆరోసారి కూడా కై వసం చేసుకొని వైఎస్సార్‌సీపీ జెండాను మున్సిపాలిటీపై ఎగురవేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వం దిగి వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే అ వకాశం ఉండి ప్రజలకు మంచి జరుగుతుందన్నా రు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, ఎరువుల ధరలు ఏది చూసినా బస్తా రూ.2 వేలకు పైగానే ఉన్నా ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. కనీసం ధరలు పెరగకుండా నియంత్రించే చర్యలు కూడా చేపట్టకుండా ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. ఇక్కడి మంత్రి ఆగిరిపల్లి మండలంలోని కొండలన్నీ కొల్లగొట్టడుతున్నా కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్ పట్టించుకోవడం లేదన్నారు. ఐఏఎస్ అధికారులైనా సహజ సంపదను సంరక్షించాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. పది కొండలకు గుండుకొట్టి బోడికొండలను చేశారన్నారు. ప్రకృతి సంపదను దోచేసుకుని కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలవాలని అధికార పార్టీ చూస్తోందని, వైఎస్సార్‌సీపీ ప్రజాబలంతో గెలుస్తుందని అన్నారు. ఎన్నికల్లో సత్తాచాటేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవ్వాలని ప్రతాప్ పిలుపునిచ్చారు. ఏపీ కో–ఆపరేటివ్ యూనియన్ మాజీ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, జెడ్పీ వైస్‌చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, పార్టీ ముసునూరు, ఆగిరిపల్లి మండలాల అధ్యక్షులు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, బెజవాడ రాంబాబు, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మందాడ శివశంకరరావు, రైతు విభాగం అధ్యక్షుడు ఈలప్రోలు వెంకట సుబ్బయ్య, జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్ తదితరులు పాల్గొన్నారు.


