ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రీ లోక్ అదాలత్‌లో రాజీ చేయబడిన కేసులతో పాటు మిగిలిన కేసు లు కూడా రాజీ చేస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొ త్తం 35 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ లోక్‌అదాలత్‌లో 7,224 కేసులను పరిష్కరించామని, వీటిలో 6,709 క్రిమినల్ కేసులు, 126 సి విల్ కేసులు, 127 వాహన ప్రమాద బీమా కేసు లు ఉన్నాయన్నారు. వాహన ప్రమాద బీమా కే సుల్లో రూ.10 కోట్లకు పైగా కక్షిదారులకు పరిహారం అందించామని, 222 ప్రీ లిటిగేషన్ కేసులను రాజీ చేశామన్నారు. టాటా ఇన్సూరెన్స్‌కు సంబంధించి రూ.38 లక్షల పరిహారాన్ని బాధితులకు అందించామన్నారు. 1వ అ దనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా జడ్జి ఎం.మీనాదేవి, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, పోక్సో స్పెషల్ జడ్జి కె.శ్రీవాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, లోక్ అ దాలత్ నామినేటెడ్ సభ్యులు కానాల రామకృష్ణ ఏపీపీ ఏవీ నారాయణ పోలీస్, రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


