ఏలూరు టౌన్ : జిల్లాలోని 155 మద్యం షాపుల రెన్యువల్స్‌కు ప్ర భుత్వం నోటిఫికేషన్ జా రీ చేసిందని మద్య నిషే ధ అబ్కారీ జిల్లా అధి కారి ఎ.అవులయ్య ప్రక టనలో తెలిపారు. 141 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో, 14 షాపులు గీత కార్మికులకు కేటాయించామని, వీటి యజమానులు ఈనెల 21న సాయంత్రం 5 గంటలలోపు రెన్యువల్ చేసుకోవాలన్నారు. రెన్యువల్స్‌కు 38 శాతం రిటైల్ ఎ కై ్సజ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి మద్యం షాపునకు పర్మిట్ రూమ్‌ను తప్పనిసరి చేశారనీ, రూ.7.50 లక్షలు, రూ.5 లక్షలుగా ఫీజులు నిర్ణయించారన్నారు. రెన్యువల్ ప్రాసెసింగ్ ఫీజు రూ.5 వేలు మద్యం లైసెన్సుదారుడు చెల్లించాలన్నారు. రెన్యువల్స్ ద్వారా రూ.153.23 కోట్లు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రెన్యువల్ చేసుకోకుంటే మరోసారి మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తామన్నారు. పర్మిట్ రూములు, లైసెన్సు ఫీజుల్లో బకాయిలు ఉంటే అనర్హులుగా పరిగణిస్తామన్నారు.
ఆగిరిపల్లి: ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆవరణలోని క ల్యాణ మండపంలో ఈనెల 20న జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు తమను సంప్రదించాలని నిర్వాహకులు యండురి నరసింహమూర్తి, బొద్దూరు సాంబశివరావు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వినాయకచవితి సందర్భంగా సోమవారం జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులకు సంబంధించిన స మాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో మీకోసం.ఏపీ.ఇన్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు.
ప్రత్తిపాడు : దుండగులు చేపల చెరువు యజమాని గొంతు కోసి హత్య చేసి, బంగారు వస్తువులు, నగదు దోచుకుపోయిన ఘటన శనివారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని టి.రాయవరంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన తటవర్తి మెహర్ ప్రసాద్‌కు చెందిన చెరువును ఏలూరు జిల్లా పైడిచింతపర్రు గ్రామానికి చెందిన మోరి నరసింహారావు (70) లీజుకు తీసుకుని నాలుగేళ్లుగా చేపలు పెంచుతున్నాడు. చెరువు వద్ద మకాంలో కొవ్వాడలంక గ్రామానికి చెందిన వితంతువైన తన కుమార్తె బలే నాగలక్ష్మితో కలిసి జీవిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం పెన్షన్ నిమిత్తం తన కుమార్తె కొవ్వాడలంక వెళ్లింది. శుక్రవారం సాయంత్రం చేపల చెరువు మకానికి సమీపంలో ఉన్న ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన స్నేహితులు గొర్ల రాంబాబు, చిరికే అప్పారావుతో కలిసి టీ తాగారు. ఆ రాత్రి వేళ ఇద్దరు లేదా ముగ్గురు అగంతకులు వచ్చారని, వారితో జరిగిన ఘర్షణలో పదునైన ఆయుధంతో నరసింహారావు మెడ కోసి, హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. నాగలక్ష్మి గదిలోని బీరువా పగలగొట్టి 10 గ్రాముల బంగారు వస్తువులు, రూ.2 లక్షల నగదు దోచుకుపోయారు. స్నేహితులు రాంబాబు, అప్పారావు ఉదయం వచ్చి పిలిచినా పలకకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా అతడు విగతజీవుడై పడి ఉన్నాడు. వారి సమాచారం మేరకు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతంతో కలిసి సీఐ బి.సూర్య అప్పారావు, డీఎస్పీ ఏబీజీ తిలక్ హత్యా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని శవపరీక్షకై ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించారు. నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘పశ్చిమ’వాసులకు స్వల్పగాయాలు
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో జాతీయ రహదారిపై శనివారం రాత్రి కాకినాడ వైపు నుంచి పశ్చిమగోదావరి జిల్లా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక వనువులమ్మ గుడిసెంటర్ వద్ద టర్నింగ్ పాయింట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. కాగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని స్థానికుల సురక్షితంగా బయట తీశారు. వారికి స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు.


