తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దిక్కుతోచని స్థితిలో పడిన ఏజెన్సీలోని పత్తి రైతులకు ఇటీవల కురుస్తున్న అనుకూల వర్షాలు కొండంత ఊరటనిస్తున్నాయి. 8లో u
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొని జిల్లాలో భూ సమస్యలపై సమీక్ష వివరాలను సీఎస్‌కు వివరించారు. గత నెల రోజుల్లో 22ఏ జాబితా నుంచి తొలగింపు కోరుతూ అందిన అర్జీల్లో 167 దరఖాస్తులను పరిష్కరించామని, ఆగస్టు నెలలో 13,666 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్ గౌడ, డీఆర్‌ఓ ఎం. శ్రీదేవి, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ ‘నేను’ కార్యక్రమం ద్వారా తమ ఆలోచనలు, సూచనలను కొద్ది సెన్కన్ల వీడియో రూపంలో అప్లోడ్ చేసి భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ మంగళవారం గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా అధికారులు, విద్యార్థులు, ప్రజలు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కోరారు. దేశభక్తిని పెంపొందించేలా పాఠశాలల్లో పోటీలు, ర్యాలీలు, విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.


