న్యూస్‌రీల్
కూటమి కుట్రలు
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఇంటింటా సర్వే చివరి దశకు చేరింది. ఓటర్లకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్)ల మ్యాపింగ్ గడువు మంగళవారంతో ముగియనుంది. ఉమ్మడి పశ్చిమలో 31.19 లక్షల ఓటర్లకు 83.29 శాతం ఓట్లు డిజిటలైజేషన్ కాగా ఇంకా 16 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్ల వద్దే ఉన్నాయి. గడువులోపు మిగిలిన వారు మ్యాపింగ్ చేసుకోకుంటే ఓటు గల్లంతే అంటున్నారు. మరోపక్క వలస ఓట్లలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 31.19 లక్షల మంది..
ఓటరు జాబితా ప్రక్షాళన కోసం గతనెల 15 నుంచి ఎన్నికల కమిషన్ సర్ కార్యక్రమం చేపట్టింది. 2002 జాబితా ప్రకారం తొలిదశలో ఓటర్ల మ్యాపింగ్‌కు నిర్ణయించింది. ఈ మేరకు బూత్ లెవిల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) ఈనెల 14 వరకు ఇంటింటికీ వచ్చి ఓటర్లకు ఎన్యుమరేషన్లు అందజేయాలి. జాబితాలోని అడ్రస్‌లో ఓటరు ఉంటున్నారా లేదా అనేది పరిశీలించి మ్యాపింగ్ చేయాలి. 2002 తర్వాత ఓటుహక్కు పొందిన వారి వివరాలను ఈసీ మార్గదర్శకాల మేరకు మ్యాపింగ్ చేయాలి. ఉమ్మడి పశ్చిమలో 31.19 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 16,44,193 ఓట్లకు గాను 92.95 శాతంతో 15.28 లక్షల ఓట్లు మ్యాపింగ్ పూర్తయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలో 14,75,036 మంది ఓటర్లు ఉండగా శనివారం నాటికి 81.05 శాతంతో 11.95 లక్షల ఓట్లు మ్యాపింగ్ పూర్తయ్యింది. అధికంగా భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం అర్బన్ ఏరియాలు, వీరవాసరం మండలంలోను, ఏలూరు జిల్లా పరిధిలోని ఏలూరు అర్బన్‌తో పాటు నూజివీడు, దెందులూరు ఏరియాలో మ్యాపింగ్ చేయాల్సిన ఓట్లు ఉన్నాయి.
పొంతనలేని లెక్కలు
ఏలూరు జిల్లాలో నూరుశాతం, పశ్చిమలో 99.91 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసినట్టు బీఎల్‌ఓలు చెబుతున్నారు. అయితే ఈ మేరకు డిజిటలైజేషన్ మాత్రం జరగలేదు. ఎన్యుమరేషన్ పూర్తికి మరో రెండు రోజులు గడువు ఉండగా 11 నాటికి పూర్తిచేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. డెత్, షిఫ్టింగ్, శాశ్వత వలసదారుల దరఖాస్తులపై ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలు ఏ మేరకు శ్రద్ధ చూపారనేది ప్రశ్నార్థకమే. సర్వే అనంతరం తొలగించిన ఓట్లు, కొత్తగా నమోదైన ఓట్లు, మార్పులు, చేర్పుల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. అనంతరం క్లయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబరు 18లోపు పరిష్కరిస్తారు. సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ నేపథ్యలో నిర్ణీత గడువులోపు డిజిటలైజ్ చేయించుకోకుంటే ఓటును కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.
ఏలూరు జిల్లా
నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం
ఉంగుటూరు 2,07,346 1,95,375 94.23
దెందులూరు 2,25,615 2,10,860 93.46
ఏలూరు 2,34,948 2,23,046 94.93
పోలవరం 2,55,122 2,36,203 92.58
చింతలపూడి 2,74,003 2,49.089 90.91
నూజివీడు 2,40,581 2,26,439 94.12
కై కలూరు 2,06,578 1,87,214 90.63
మొత్తం 16,44,193 15,28,226 92.95
పశ్చిమగోదావరి జిల్లా
నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం
ఆచంట 1,79,987 1,49,707 83.18
పాలకొల్లు 1,95,062 1,64,813 84.49
నరసాపురం 1,71,053 1,46,367 85.57
భీమవరం 2,52,549 1,85,981 73.64
ఉండి 2,26,503 1,80,241 79.58
తణుకు 2,35,359 1,91,697 81.45
తాడేపల్లిగూడెం 2,14,523 1,76,771 82.40
మొత్తం 14,75,036 11,95,557 81.05
ఉమ్మడి పశ్చిమలో 31.19 లక్షల ఓటర్లు
83.29 శాతం డిజిటలైజేషన్ పూర్తి
ఇంకా ఓటర్ల వద్ద ఉన్న ఎన్యుమరేషన్ ఫారాలు 17 శాతం
14తో ముగియనున్న గడువు
ఈలోపు డిజిటలైజ్ కాకుంటే ఓటు గల్లంతే!
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు కూటమి కుట్రలు
ఏఐ సృష్టించిన చిత్రం
షిఫ్టింగ్, శాశ్వత వలసదారుల ఓట్ల విషయంలో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా మ్యాపింగ్ కాని ఆయా ఓట్లను తొలగించాల్సి ఉంది. కాగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి కూటమి పార్టీలకు చెందిన వారి ఓట్లను కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నట్టు సమాచారం.


