గంటల వ్యవధిలో బాలుడి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

గంటల వ్యవధిలో బాలుడి గుర్తింపు

Jul 12 2026 1:11 AM | Updated on Jul 12 2026 1:11 AM

గంటల వ్యవధిలో బాలుడి గుర్తింపు పుష్కర పనులకు కేంద్ర గ్రాంటు

కై కలూరు: తాతతో వచ్చిన మనవడు తప్పిపోయిన సంఘటనలో సీసీ కెమెరాల సాయంతో గంటల వ్యవఽధిలోనే పోలీసులు బాలుడిని గుర్తించారు. ఈ సంఘటన కై కలూరు బంగారపు కొట్లు వీధి స్టీల్‌ సామగ్రి విక్రయ దుకాణం వద్ద శనివారం చోటుచేసుకుంది. కై కలూరు టౌన్‌ ఎస్సై కె.గణేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాచపట్నంకు చెందిన చక్కా మురళీ స్టీల్‌ కొట్టు వద్దకు మనవడు సుందర్‌ (5)తో కలిసి సాయంత్రం 5.30 గంటలకు వచ్చారు. కొద్ది సమయానికి బాలుడు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా సీసీ కెమెరాల ఆధారంగా బాలుడు బైపాస్‌ రోడ్‌ మాత స్కూల్‌ గ్రౌండ్‌లో ఉన్నట్టు గుర్తించారు. రాత్రి 8.30 గంటలకు సీఐ ఏవీఎస్‌ రామకృష్ణ సమక్షంలో బాలుడిని తాతకు అప్పగించారు. తక్షణమే స్పందించిన ఎస్సైను సీఐ అభినందించారు.

నరసాపురం: నరసాపురంలో పుష్కరాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం రుణవాటా కింద అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) గ్రాంట్‌ మంజూరు చేసినట్టు మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం గ్రాంటును 25 శాతం రుణం రూపంలో ఇస్తుందని, మిగిలిన 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. యూసీఎఫ్‌ గ్రాంటు కింద నరసాపురం మున్సిపాలిటీ రూ.34 కోట్ల అర్హత సాధించిందన్నారు. ముందుగా పుష్కరాల అభివృద్ధి పనులు, నిర్వహణపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement