ఆక్వా రైతుల ఆశలన్నీ జగన్‌పైనే.. | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతుల ఆశలన్నీ జగన్‌పైనే..

Jul 13 2026 1:10 AM | Updated on Jul 13 2026 1:10 AM

ఆక్వా రైతుల ఆశలన్నీ జగన్‌పైనే..

రైతులు ఎదురు చూస్తున్నారు

రైతుల పక్షపాతి జగన్‌

స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు..

భీమవరం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉదాసీన తతో ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ తీరు, సిండికేట్ల దగాతో ఢీలాపడ్డ రైతులు ఆశలన్నీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపైనే పెట్టుకున్నారు. మూడు నెలలుగా ఆక్వా ఫీడు, సీడు ధరలు విపరీతంగా పెరగడం, రొయ్యల ధరలు తగ్గడంతోపాటు తెగుళ్ల కారణంగా ఆక్వా రంగంలో అలజడి మొదలైంది. ఫీడు ధరలు తగ్గించాలంటూ రైతులు ఫీడు బస్తాలను తగలపెట్టడం, రొయ్యలను రోడ్లపై పారబోయడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆక్వారంగానికి అండగా ఉంటానంటూ వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో పాటు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తూర్పారబట్టారు. జగన్‌ భరోసాతో రైతులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేయడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఫీడు ధరను కిలోకు రూ.4 తగ్గించేలా కంపెనీ యజమానులను ఒప్పించడమేగాక రొయ్యల ధరలు నిలకడగా ఉండేందుకు రొయ్యల ఎగుమతిదారులతో ప్రభు త్వం సమావేశాలు నిర్వహించింది. అలాగే జోన్‌తో పరిమితం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్‌ ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయినా కంపెనీలు ఫీడు ధరను రూ.2 మా త్రమే తగ్గించడం, రొయ్యల ధర తగ్గుదల, సబ్సిడీ విద్యుత్‌ అమలు కావడం లేదు. దీంతో ఆగ్రహించిన కొందరు ఆక్వా రైతులు స్వచ్ఛందంగా క్రాప్‌ హాలిడే కూడా ప్రకటించారు. ఇదే తరుణంలో ప్రభుత్వమే క్రాప్‌ హాలిడే ప్రకటించాలంటూ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌ రాజు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆక్వా రైతులకు అండగా ఈనెల 15న భీమవరంలో వైఎస్‌ జగన్‌ నిర్వహించే బహిరంగ సభపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. అప్పటికై నా ప్రభుత్వంలో చలనం వచ్చి ఆక్వారంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకుంటుందని ఆకాంక్షిస్తున్నారు.

విస్తృత ప్రచారం

భీమవరంలో జరుగనున్న ఆక్వా సదస్సును జయప్రదం చేసేందుకు వైఎస్సార్‌సీపీ విస్తృత ప్రచారం చేపట్టింది. దీనిలో భాగంగా ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ప్రత్యేక ప్రచార రథాలకు జెండా ఊపి ప్రారంభించారు. జగన్‌ రాకను మారుమూల ప్రాంతంలోని ఆక్వా రైతులకు సైతం చేరేలా ప్రచారం చేస్తున్నారు. ప్రచార రథాల ప్రారంభోత్సవంలో భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పరిశీలకుడు మంతెన సోమరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్‌ రాజు, ఎస్‌ఈసీ సభ్యుడు మంతెన యోగీంద్రబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, సోషల్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు, గంటా రాహుల్‌ పాల్గొన్నారు.

సంక్షోభంలో ఆక్వా రంగం

పెరిగిన సీడ్‌, ఫీడ్‌ ధరలతో సతమతం

రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరాటం

15న భీమవరానికి వైఎస్‌ జగన్‌ రాక

ప్రత్యేక వాహనాలతో విస్తృత ప్రచారం

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపైనే ఆశలు పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా టమాటా, మామిడి, పొగాకు వంటి రైతుల ఇబ్బందుల తరుణంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆయా రైతులకు అండగా నిలిచారు. అదేబాటలో ఆక్వా రైతులు కూడా జగన్‌ పర్యటనతో తమకు మేలు చేకూరుతుందని ఆశిస్తున్నారు.

– చినమిల్లి వెంకటరాయుడు, భీమవరం సమన్వయకర్త

తండ్రి బాటలోనే వైఎస్‌ జగన్‌ కూడా రైతులకు భరోసాగా నిలుస్తున్నారు. కోవిడ్‌ సమయంలో సైతం రొయ్యల ధరలు తగ్గకుండా ప్రభుత్వ యంత్రాంగంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. ప్రస్తుత ఆక్వారంగ సంక్షోభంలో రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పించేందుకే భీమవరం పర్యటనకు వస్తున్నారు. ఇప్పటికై నా ప్రభు త్వంలో కదలిక వస్తుందనే ఆశ.

– ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆక్వా రైతులు సంఘాలుగా ఏర్పడి ఉద్యమిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ పర్యటనను విజయవంతం చేయడానికి ఉమ్మడి పశ్చిమ, తూర్పు కృష్ణా జిల్లా రైతులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్‌ వద్ద తమ గోడును వెళ్లబోసుకోవాలని, తద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే సంకల్పంతో భీమవరం సభకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement