చినవెంకన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

చినవెంకన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

Jul 13 2026 1:10 AM | Updated on Jul 13 2026 1:10 AM

చినవెంకన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి నేడు భారీ ధర్నా సీఎం పర్యటనకు పటిష్ట భద్రత రాట్నాలమ్మా నమోస్తుతే నేడు ప్రత్యేక పూజలు

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బాలాజీ మెడమల్లి ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వా గతం పలికారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం ఆయన శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. న్యాయమూర్తికి అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు చినవెంకన్న చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. భీమడోలు కోర్టు జడ్జి ఎస్‌.ప్రియదర్శిని నూతక్కి, ఆలయ సూపరింటెండెంట్‌ ఐవీ రామారావు ఉన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఏలూరు కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్‌ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ఫైర్‌స్టేషన్‌ సెంట నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్‌ తదితరులు పాల్గొంటారన్నారు.

పోలవరం రూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. పోలవరం ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలిచ్చారు. రూట్‌ బందోబస్తు, రూఫ్‌టాప్‌ భద్రత, ప్రధాన కూడళ్లలో మూవబుల్‌ బ్యారికేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది అంతా రెయిన్‌కోట్లు, గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) వై.ప్రసాదరావు, డీఎస్పీలు శ్రావణ్‌కుమార్‌, ప్రసాద్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, పోలవరం ఇన్‌స్పెక్టర్‌, ఎస్సై అప్పారావు తదితరులు పా ల్గొన్నారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 1:20 నిమిషాలకు సీఎం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.

పెదవేగి : భక్తుల పాలిట కల్పతరువు రాట్నాలకుంటలో రాట్నాలమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కు లు తీర్చుకున్నారు. ఆలయానికి పలు రూ పాల్లో రూ.1,33,187 ఆదాయం లభించినట్టు ధర్మకర్తల మండలి చైర్మన్‌ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఈఓ నల్లూరి సతీష్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాసశివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రధానార్చకులు సన్నిదిరాజు కృష్ణారావు మాట్లాడుతూ సోమవారం, మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం అరుదని అన్నారు. ప్రతి సోమవారం ఆలయంలో సప్త మారేడు దళాలతో ఏడు ప్రదక్షిణలు, ఏడు సోమవారాలు చేయనున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement