మట్టి తవ్వకాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

మట్టి తవ్వకాలకు చెక్‌

Jul 12 2026 1:11 AM | Updated on Jul 12 2026 1:11 AM

మట్టి తవ్వకాలకు చెక్‌ సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు సచివాలయ ఉద్యోగులపై ఆగ్రహం బాలికపై లైంగిక దాడి

ద్వారకాతిరుమల: రామన్నగూడెం పంచాయతీ ప రిధిలోని జలపవారికుంట చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు నిషిద్ధమంటూ శనివారం రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. ఈనెల 9న ‘సాక్షి’లో ‘వేంపాడు చెరువులో యఽథేచ్ఛగా మట్టి తవ్వకాలు’ శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందించారు. చెరువులో మట్టి తోలకం నిషిద్ధమని, అతి క్రమిస్తే చర్యలు తప్పవని ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు.

పోలవరం రూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారని, పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. శనివారం ఆమె పోలవరం ప్రాజెక్టు పరిధిలో హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని, ఈసీఆర్‌ డ్యామ్‌ గ్యాప్‌ 1, 2, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు (పవర్‌ హౌస్‌) పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం జిల్లా కలెక్టర్‌ కె.దినేష్‌కుమార్‌, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌, జేసీ ఎంజే అభిషేక్‌గౌడతో కలిసి సమావేశం నిర్వహించారు. ధవళేశ్వరం గేట్ల ప్రారంభోత్సవ పర్యటన ముగించుకుని, అదే రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు సీఎం పోలవరం చేరుకుంటున్నారన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్‌ మాట్లాడుతూ సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ వి.అభిషేక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆర్‌.రామచంద్రరావు, ఏఎస్పీ వై.ప్రసాదరావు, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్‌, ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు.

ఉంగుటూరు: నారాయణపురం సచివాలయ ఉద్యోగులపై ఏలూరు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా సమా చారం ఇచ్చినా ఎవరు అందుబాటులో లేకపోవడంపై మండిపడ్డారు. ఓటర్ల సమగ్ర సర్వేలో వెనుకబడి ఉండటంపై ప్రశ్నించారు. శనివారం ఆమె బాదంపూడి, ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, కై కరం గ్రామాల్లోని సచివాలయాలను పరిశీలించారు. త్వరితగతిన ఓటర్ల సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్లు జాబితా డిజిటలైజేషన్‌లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి చేయని ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తామన్నారు. నారాయణపురం–1 సచివాలయంలోకి వెళ్లినప్పుడు వీఆర్వో, డిజిటల్‌ అసిస్టెంట్‌ తప్ప మిగిలిన ఉద్యోగులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్‌ ప్రక్రియకు 14 ఆఖరి తేదీ అని ఈ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. అనంతరం సిబ్బంది అందరూ సచివాలయానికి హాజరై విధులు నిర్వహించారు.

యువకుడిపై కేసు నమోదు

ద్వారకాతిరుమల: బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని గర్భిణిని చేసిన యువ కు డిపై ద్వారకాతిరుమల పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై టి.సుధీర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం గ్రామానికి చెందిన ఓ బాలిక భీమడోలులో ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. రోజూ బస్సులో రాకపోకలు సాగిస్తోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం సరిగా లేక పోవడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భిణి అని నిర్ధారణ అయ్యింది. దీంతో బాలికను తల్లి ఆరా తీయగా అదే గ్రామానికి చెందిన పి.మాన్‌సింగ్‌ అనే యువకుడు తనకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడని, తన ఫొ టోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement