ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఉ మ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎస్.శ్రీదేవి చెప్పారు. శనివారం స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో 2వ జాతీయ లోక్‌అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కక్షిదారుల మధ్య సామర స్య వాతావరణంలో విభేదాలు తగ్గించేందుకు, కేసు ల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహి స్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 36 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. వాహన ప్రమాద బీమా కేసులో టాటా జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.20 లక్షల చెక్కులను కక్షిదారులకు అందజేశారు. 1వ అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా జడ్జి ఎం.మీనాదేవి, 5వ అదనపు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్ మురళీకృష్ణ, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, ప్రభుత్వ న్యాయవాది సుబ్రహ్మణ్యం, లోక్ అదాలత్ సభ్యుడు అబ్బినేని వి జయకుమార్ పాల్గొన్నారు. కక్షిదారులకు సీతారాం ఆహార పొట్లాలను అందజేశారు.
7,890 కేసుల రాజీ : 7,890 కేసులను రాజీ చేశారు. వీటిలో 7,437 క్రిమినల్, 215 సివిల్, 185 వాహన ప్రమాద, 53 ఫ్రీలిటిగేషన్ కేసులు రాజీ చేసినట్టు తెలిపారు. వాహన ప్రమాద బీమా కేసులకు సంబంధించి రూ.12.18 కోట్లు పరిహారంగా చెల్లించారు.


