ఎరువు.. అక్రమాల దరువు | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. అక్రమాల దరువు

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

సాక్షి, భీమవరం: ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌, జిల్లాల మధ్య అక్రమ రవాణాకు తాడేపల్లిగూడెం కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందా? కొందరు హోల్‌సేల్‌ డీలర్లు పాత స్టాకును రీప్యాకింగ్‌ చేసి అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారా? ఇందుకు కూటమి నేతలు, కొందరు ఉద్యోగులు కొమ్ముకాస్తున్నారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

జిల్లాలో తాడేపల్లిగూడెం ఎరువుల ర్యాక్‌ పా యింట్‌గా ఉంది. ఫెర్టిలైజర్స్‌ వ్యాపారంలో దీర్ఘకాలంగా వ్యాపారం అనుభవం ఉన్న డీలర్లు ఇక్కడ ఎందరో ఉన్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 2.21 లక్షలు, రబీ సాగు విస్తీర్ణం 2.3 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. తొలకరిలో 17,800 టన్నుల యూరియా, 1,650 టన్నుల డీఏపీ, 32,500 ట న్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరమవుతాయి. దా ళ్వాలో 41,821 టన్నుల యూరియా, 64,992 టన్నుల ఇతర ఎరువులు వినియోగిస్తుంటారు. జిల్లాతో పాటు పరిసర జిల్లాలకు కంపెనీల కేటాయింపుల మేరకు యూరియా, డీఏపీ, ఇతర రకాల ఎరువులు రైల్వే వ్యాగన్లు ద్వారా సరఫరా అవుతుంటాయి. గూడెం నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, నవాబుపాలెం, పెదతాడేపల్లి, చినతాడేపల్లి తదితర ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్‌, ప్రైవేట్‌ డీలర్లకు చెందిన గోదాముల్లో వీటిని నిల్వ చేస్తుంటారు.

రీ ప్యాకింగ్‌తో సొమ్ములు

ఏడాదిన్నర క్రితం ఓ కంపెనీ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్న హోల్‌సేల్‌ డీలర్‌కు పెద్ద మొత్తంలో ఎరువులను కేటాయించింది. సదరు డీలరు వీటిని రీప్యాకింగ్‌ చేసి బస్తాకు రూ.30 నుంచి రూ.40 అదనంగా సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇదే తరహాలో మరికొందరు అక్రమాలకు పాల్పడినట్టు అప్పట్లో చర్చ నడిచింది. గతేడాది అధికారుల తనిఖీల్లో పలు గోదాముల్లో స్టాకు వ్యత్యాసాలు గుర్తించినా రాజకీయ ఒత్తిళ్లతో వాటిని కప్పిపుచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

కృత్రిమ కొరత సృష్టించి..

కొందరు హోల్‌సేల్‌ డీలర్లకు పలు జిల్లాల్లో లైసెన్సులు ఉండటంతో కృత్రిమ కొరత సృష్టించి ఒక జిల్లాకు కేటాయించిన ఎరువులను మరో జిల్లాలో అధిక ధరలకు విక్రయిస్తూ రైతులపై భారం మోపుతున్నారంటున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చి న సమయంలో కేవలం స్టాకు రికార్డులు మాత్రమే పరిశీలిస్తున్నారని, ఒక జిల్లాకు వచ్చిన సరుకు వాస్తవానికి ఏ జిల్లాలో విక్రయించారు? వే బిల్స్‌, ఇతర రవాణా పత్రాల ఆధారంగా పూర్తి పరిశీలన చేయకపోవడం వలన అక్రమాలు బయటకు రావడం లేదంటున్నారు. ఇటీవల యూరియా కంపెనీలు ఎమ్మార్పీ ధరను దఫదఫాలుగా రూ.5 నుంచి రూ.30 వరకు పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో తక్కువ ధరకు వచ్చిన వాటిని రీప్యాకింగ్‌ చేసి కొత్త ధరకు సరఫరా చేశారని తెలుస్తోంది.

పక్కదారి పట్టిస్తూ..

ప్రస్తుతం రైతులు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటేగాని ఎరువుల కొనుగోలుకు అవకాశం లేదు. ఇదంతా రికార్డ్‌ ప్రకారం జరుగుతుంది. జిల్లాలో వ్యవసాయం చేసే రైతుల కంటే కౌలు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలామందికి కౌలు గుర్తింపు కార్డులు లేవు. ఎరువుల కోసం అసలు రైతు పాస్‌బుక్‌ జెరాక్సులను ఎరువుల దుకాణాల్లో అందజేసి ఎరువులు పొందుతున్నారు. వీటి ఆధారంగా వ్యాపారులు ఎరువులను దారి మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూరియా బస్తా అసలు ధర రూ.260 కాగా జి ల్లాలోని పలుచోట్ల రూ.300 నుంచి రూ.320 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నట్టు తెలిసింది.

ఉన్నత స్థాయికి ఫిర్యాదు

గోదాములపై పూర్తిస్థాయిలో నిఘా కొరవడటంతో డీలర్ల ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలున్నాయి. గతేడాది యూరియా కొరత ఏర్పడటం, అ ధిక ధరలకు అమ్మకాలు చేయడం నిదర్శనంగా రై తులు చెబుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసే ది శగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలంటున్నారు. గోడౌన్లలో ఉన్న స్టాకును భౌతికంగా త నిఖీలు చేయాలని, వేబిల్స్‌, రవాణా పత్రాలు, స్టాక్‌ మూమెంట్‌, రిటైల్‌, హోల్‌సేల్‌ డీలర్ల లావాదేవీలను పూర్తిగా పరిశీలించాలని కోరుతున్నారు. గుంటూరుకు చెందిన ఒక అధికారి అండతో జిల్లాలో ఎ రువుల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొంద రు ఉన్నత స్థాయికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

నిఘా కరువు

ఫెర్టిలైజర్స్‌ ర్యాక్‌ పాయింట్‌గా తాడేపల్లిగూడెం

గూడెం, పరిసరాల్లో విస్తరించిన ఎరువుల గోదాములు

గతంలో రీ ప్యాకింగ్‌, బ్లాక్‌ మార్కెట్‌తో భారీగా దోపిడీ

కూటమి నేతల కనుసన్నల్లో ఎరువుల దందా

అక్రమాల అడ్డుకట్టకు ఉన్నత స్థాయికి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement