ఖైదీలకు అందించే ఆహారంలో రాజీ పడొద్దు | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు అందించే ఆహారంలో రాజీ పడొద్దు

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

ఖైదీలకు అందించే ఆహారంలో రాజీ పడొద్దు రేపు జాతీయ లోక్‌అదాలత్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈగా గోపాలన్‌ డీఈఎల్‌ఈడీ మార్కుల జాబితా విడుదల శ్రీవారికి కాసుల పంట డిజిటలైజేషన్‌ వేగిరపర్చాలి

ఏలూరు (టూటౌన్‌): ఖైదీలకు అందించే ఆహారంలో రాజీ వద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి ఆదేశించారు. గు రువారం ఏలూరులోని జిల్లా కారాగారాన్ని ఆ మె సందర్శించారు. ముద్దాయిలకు అందిస్తున్న సౌకర్యాలపై తమ పర్యవేక్షణ ఉంటుందన్నారు. నాణ్యమైన ఆహారం, మంచినీరు, వైద్య సదుపాయం అందించాలన్నారు. అలాగే ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నారని రాజీయోగ్యమైన కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌ భవన్‌లో అదేరోజు ఉదయం 10 గంటలకు లోక్‌ అదాలత్‌ ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆమె చెప్పారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జలవనరుల శాఖ పరిధిలో ఏలూరు ఇరిగేషన్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌గా గోదావరి గోపాల్‌ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ రాష్ట్ర అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ దేవరకొండ వెంకటేశ్వర్లు, అసోసియేషన్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, గౌరవ అధ్యక్షుడు సీహెచ్‌ దేవప్రకాష్‌, ఉపాధ్యక్షుడు ధనుంజయులు ఆయనకు సత్కారం చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని జలవనరులను సాగునీటికి, తాగునీటికి, ప్రజల ఇతర అవసరాలకి స మర్థవంతంగా వినియోగిస్తామని గోపాలన్‌ అ న్నారు. ఇంజనీర్లంతా సహకరించాలని కోరా రు. డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీఈఎల్‌ఈడీ 2023–25 రెగ్యులర్‌ బ్యాచ్‌, ఒకసారి ఫెయిలైన 3,4 సె మిస్టర్ల విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల్లో మార్కుల జాబితాలు పొందవచ్చ ని పేర్కొన్నారు. అలాగే డీఈఎల్‌ఈడీ 2024– 26 రెగ్యులర్‌ బ్యాచ్‌కు గత ఏప్రిల్‌లో జరిగిన పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేసినట్టు చెప్పారు. వీటిని బీఎస్‌ఈ ఏపీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

17 రోజులు.. రూ.1.98 కోట్లు

ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. జి ల్లా దేవదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, పోలీసుల పర్యవేక్షణలో జరిపిన లెక్కింపులో విశేష ఆ దాయం సమకూరింది. గత 17 రోజులకు నగదు రూపేణా రూ.1,98,46,114, కానుకల రూపంలో 219 గ్రాముల బంగారం, 2.070 కిలోల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పా త రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.10 వేలు లభించిందన్నారు. సగటున రోజుకి రూ.11,67,418 ఆదాయం వచ్చిందన్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిట లైజేషన్‌ పనులు 11వ తేదీలోపు పూర్తిచేయా లని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో ఆమె టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఎ న్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌, ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాల న్నారు. జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, ఇన్‌చార్జి డీఆర్వో దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement