ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఏపీపీటీఏ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకా శేషుకుమార్, చాగంటి శివరాం డిమాండ్ చేశారు. గురువారం డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మకు గురువారం వినతిపత్రం సమర్పించారు. కమిషన్‌ను నియమించేలోపు 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఐదు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలని, లేకుంటే సర్వీసుకు ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని, బీపీఎస్ స్కూల్‌లో 40 పైగా రోల్ ఉన్నచోట ఒక ఎంటీఎస్ లేదా మిగులు ఉపాధ్యాయులను ఇవ్వాలని కోరారు. ముందుగా ఏపీపీటీఏ (2026–28) కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. అబ్దుల్ రజాక్ అస్లాం ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.


