గోదావరి వరదలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

గోదావరి వరదలపై అప్రమత్తం

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

ఏలూరు (టూటౌన్‌): రానున్న వర్షాకాలంలో గోదావరికి వచ్చే వరదల కారణం ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టాలు కలగకుండా సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి గురువారం గో దావరి వరదలకు సన్నద్ధత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జీఎస్టీ వసూళ్లు, సర్‌ ప్రగతి తదితర అంశాలపై జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గండ్లు పడే అవకాశం ఉన్న కాలువలు, చెరువుల ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వరద హెచ్చరికల స మయంలో పటిష్ట ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ఈనెల 13న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చే అవకాశం ఉందని, పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. జేసీ అభిషేక్‌ గౌడ, ఇన్‌చార్జి డీఆర్వో దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement