న్యూస్‌రీల్
గురువారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మహానేత మేలును మరిచిపోలేం.. జిల్లాలో దివంగత వైఎస్సార్ హయాంలో చేసిన అభివృద్ధి సుస్థిరం. అనేక మందికి రాజకీయ గురువుగా.. లక్షలాది మందికి అభిమాననేతగా మారిన దివంగత వైఎస్సార్ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు వాడవాడల ఘనంగా నివాళులర్పించి బైక్ ర్యాలీ, సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
● ఏలూరు నియోజకవర్గంలో..
ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ నేతృత్వంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకు పార్టీ శ్రేణులు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటరులో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ నివాళులర్పించి అనంతరం భారీ కేక్‌ను కట్ చేశారు. పార్టీ కార్యాలయంలో మహిళలకు చీరలు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
● కై కలూరు నియోజకవర్గంలో..
కై కలూరు నియోజకవర్గం కై కలూరులో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కై కలూరు సంత మార్కెట్ వద్ద 24 అడుగుల వైఎస్సార్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు.
● నూజివీడు నియోజకవర్గంలో..
నూజివీడు నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నూజివీడులో చినగాంధీ బొమ్మ సెంటరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు నివాళులర్పించారు. అనతంరం భారీ కేక్‌ను కట్ చేశారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.
● పోలవరం నియోజకవర్గంలో..
పోలవరం నియోజకవర్గంలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో వైఎస్సార్ విగ్రహానికి నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ను కట్ చేశారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
● ఉంగుటూరు నియోజకవర్గంలో..
ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఉంగుటూరు మండలం చేబ్రోలులో, నిడమర్రు మండలం పెదనిండ్రకొలను, గణపవరం మండలాల్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేబ్రోలులో పంచాయతీ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.
● చింతలపూడి నియోజకవర్గంలో..
చింతలపూడి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్‌చేశారు. అనంతరం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో పాతబస్టాండ్ సెంటరులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
● దెందులూరు నియోజకవర్గంలో..
దెందులూరు నియోజకవర్గంలో దెందులూరులో నాగులదేవునిపాడు, పెదవేగి మండలంలో విజయరాయి, పెదపాడు మండలంలో అప్పనవీడు, ఏలూరు రూరల్ మండలంలో పాలగూడెంలో పార్టీ సీనియర్ నేత, ఏపీ ఆయిల్‌ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు దివంగతనేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు.
● గోపాలపురం నియోజకవర్గంలో..
గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమలలో మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు.
మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి
వాడవాడలా ఘనంగా 75వ జయంతి వేడుకలు
ఏలూరు, ఉంగుటూరుల్లో సేవా కార్యక్రమాలు
మహానేత సేవలు కొనియాడిన నేతలు


