రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో భాగంగా రాష్ట్రంలో మూడు ట్రిపుల్‌ఐటీలను వైఎస్సార్ హయాంలో ప్రారంభించారు. వాటిలో నూజివీడు ట్రిపుల్‌ఐటీ ఒకటి. 120 ఎకరాల విస్తీర్ణంలో ఏటా 2వేల అడ్మిషన్లతో కార్పొరేట్‌కు దీటుగా ఆధునాతన భవనాలతో ప్రారంభమైంది. 6 వేల సీట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును పేద పిల్లలకు ప్రతిభ ఆధారంగా అందిస్తున్నారు. వైఎస్ మరణానంతరం అడ్మిషన్ల సంఖ్య తగ్గించారు. 75 మంది మెంటార్లు, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, గెస్ట్ లెక్చరర్లు ఇలా 175 మందికిపైగా సిబ్బంది ఉన్నారు. కెమికల్ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్, ఎంఎంఈ బ్రాంచుల్లో వేలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్నత కొలువుల్లో స్థిరపడ్డారు.


