మీరు ఇక మారరా ‘సర్‌’? | - | Sakshi
Sakshi News home page

మీరు ఇక మారరా ‘సర్‌’?

Jul 8 2026 1:02 AM | Updated on Jul 8 2026 1:02 AM

మీరు ఇక మారరా ‘సర్‌’? కట్నం వేధింపులపై కేసు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: సర్‌ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చొరబడుతున్నారు. ఏకంగా గ్రామ సచివాలయంలో బీఎల్‌ఓలతో కలిసి డిజిటలైజేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. తాజాగా పెంటపాడు మండలం మౌంజీపాడు గ్రామ సచివాలయంలో టీడీపీ నాయకుడు పాతూరు రాంప్రసాద్‌ చౌదరి డిజిటలైజేషన్‌ ప్రకియను నిర్వహిస్తున్నాడు. గతంలో ఈయనే ఓ మహిళ ఫామ్‌ను నింపడం చర్చనీయాంశమైంది. అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ నాయకులపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకవపోవడం గమనార్హం.

తణుకు అర్బన్‌: కట్నం కోసం వేధిస్తున్న భర్తతో పాటు మరొక నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తణుకు రూరల్‌ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన మానసకు హైదరాబాద్‌కు చెందిన తుమ్మల కృష్ణతో 2002లో వివాహమైంది. పెళ్లి నాటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నారని బాధితురాలి తండ్రి శ్రీమన్నారాయణమూర్తి పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement