అడ్డగోలు అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలు అక్రమాలు

Jul 3 2026 12:34 AM | Updated on Jul 3 2026 12:34 AM

రూ.4.03 కోట్లు.. 19 పనులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పదవీ కాలం కొద్దిరోజుల్లో పూర్తవుతుంది.. కనీసం ఇప్పుడైనా నాలుగు రూపాయలు సంపాదించుకోకపోతే ఎలా.. నిబంధనలు ఎలా ఉన్నా.. ఏఈ నుంచి కమిషనర్‌ వరకు ఎవరు బలైనా మాకు అనవసరం.. మా పనులు కావాల్సిందే.. మా కమీషన్లు అందాల్సిందే ఇది ఏలూరు నగ రపాలక సంస్థ సభ్యుల తీరు. కౌన్సిల్‌ తీర్మానం లేకుండా స్థాయి సంఘం సమావేశం రహస్యంగా నిర్వహించి కౌన్సిల్‌ తీర్మానం చేసినట్టు హడావుడిగా 19 పనులకు రూ.4.03 కోట్ల కేటాయింపు ప్రతిపాదనలు ఖరారు చేశారు. ఇక్కడ మరో ప్రత్యేక విషయమేమింటే.. ఏలూరు మేయర్‌ భర్తకు చెందిన లేఅవుట్‌లో మళ్లీ రోడ్లు నిర్మాణానికి రూ.96 లక్షలు కేటాయించుకోవడం గమనార్హం.

ఒత్తిళ్లు.. నిబంధనలకు నీళ్లు

ఏలూరు నగరపాలక సంస్థలో అడ్డగోలు దందాకు తెరపడటం లేదు. టౌన్‌ ప్లానింగ్‌ మొదలు ఇంజనీరింగ్‌ వరకు అధికారుల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. తాజాగా కొద్ది నెలల క్రితం టౌన్‌ప్లానింగ్‌లో భారీ అవతవకలు జరిగాయని, అలాగే అనుమతులకు మించి అక్రమ కట్టడాలు నగరంలో ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రెండు రోజులపాటు సమగ్రంగా రికార్డులు పరిశీలించడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఇక తాజాగా ఏలూరు నగరంలో జరిగిన రూ.56 కోట్ల విలువైన 1,621 నామినేషన్‌ పనులపైనా ఆరోపణలు రావడం లోకాయుక్తకు ఫిర్యాదులు అందడంతో లోకాయుక్త నామినేషన్‌ పనులపై క్షుణ్ణంగా విచారించి నివేదికలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర మున్సిపల్‌ శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో రాజమండ్రి మున్సిపల్‌ ఆర్‌డీ సీహెచ్‌ నాగనరసింహారావు, ఏలూరు కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌లు వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఈ పనుల్లోనూ రూ.2.06 కోట్లు మేయర్‌ భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబుకు చెందిన ఎస్‌ఎంఆర్‌నగర్‌లో పనులు నిర్వహించారు. లేఅవుట్‌లో నిబంధనలకు విరుద్ధంగా పనులు ఎలా చేశారు.. ఫైల్‌ ప్రా సెసింగ్‌ ఎలా చేశారని.. లేఅవుట్‌లో ఎన్ని ఇళ్లు ఉ న్నాయి.. కార్పొరేషన్‌కు ఎంత ఆదాయం వస్తుంద ని కూడా తదితర వివరాలు కోరారు. వీటిపై ఇప్పటికే ఇంజనీరింగ్‌ అధికారులు ఉక్కిరిబిక్కిరి అ వుతున్న తరుణంలో గత నెల 17న స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు.

ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం

ఏలూరు కార్పొరేషన్‌లో వింత పరిస్థితి

కౌన్సిల్‌ నిర్వహించకుండానే పనుల ఖరారు

15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.4.03 కోట్లతో పనులు

మళ్లీ మేయర్‌ లేఅవుట్‌కు రూ.96 లక్షల పనులు

లోకాయుక్త విచారణ కొనసాగుతున్నా మరోసారి పనుల కేటాయింపు

పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో హడావుడి వ్యవహారం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు

కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి రూ.4.03 కోట్ల వ్యయంతో 19 పనులు ఖరారు చేసి ప్రతిపాదనలు పంపారు. వీటిల్లో కూడా కొన్ని ఎస్‌ఎంఆర్‌ నగర్‌లోని లేఅవుట్‌లో రూ.96 లక్షలతో అంచనాతో రెండు పనులను ప్రతిపాదించిన ప నులను ఎస్‌ఎంఆర్‌ నగర్‌ లేకుండా సర్వే నెంబర్‌, ఫలనా వ్యక్తి ఇంటి నుంచి ఫలానా వ్యక్తి ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం రూ.24 లక్షలు, మళ్లీ అదే లేఅవుట్‌లో 50వ డివిజన్‌ సర్వే నంబబరుతో ఫలానా వ్యక్తి ఇంటి నుంచి ఫలానా ప్లాట్‌ వరకు రహదారి నిర్మాణం రూ.72 లక్షలు కేటాయింపు ప్రతిపాదనలు పంపారు. సాధారణ లేదా అత్యవసర కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించి పనులు ఖరారు చేస్తారు. అయితే 17న స్టాండింగ్‌ కౌన్సిల్‌ నిర్వహించినట్టు చెబుతున్నారు గాని మార్చి 27న బడ్జెట్‌ సమావేశాల అనంతరం ఇప్పటివరకు ఎలాంటి కౌన్సిల్‌ సమావేశం జరగలేదు. ఈ నెలాఖరుతో పాలకవర్గం ముగియనుండటంతో హడావుడిగా ప్రతిపాదనలు పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌కు రిటైర్డ్‌ ఏఈ కేవీ సాయిప్రసాద్‌ ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement