ఉండి: డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు తనకు చేసిన అన్యాయానికి తగిన న్యాయం చేయాలంటూ ఉండి మండలం వెలివర్రులో టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి(సస్పెండ్ చేశామని టీడీపీ నాయకులు చెబుతున్నారు) పొత్తూరి వెంకటేశ్వరరాజు(బుడ్డియ్యరాజు) చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పేగులకు సబంధించిన ఆపరేషన్ చేయించుకున్న ఆయన నేరుగా వెలివర్రుకు చేరుకుని ఆమరణదీక్ష చేపట్టారు.నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్సీకర్ రఘురామకృష్ణంరాజు ప్రోద్భలంతోనే తన ఇల్లు, పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టి తనను నడిరోడ్డుపైకి లాగారని తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి లోకేష్ తనకు తగిన న్యాయం చేసే వరకు ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని వెంకటేశ్వరాజు చెబతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఆమరణదీక్ష చేపట్టడంతో పలువురు ఆయన అభిమానులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మద్దత్తుగా పలు ప్రాంతాల నుండి బంధువులు,టీడీపీకి చెందిన కొందరు ఆయనను పరామర్శిస్తున్నారు. అయితే దీక్ష ప్రారంభించిన రోజే పోలీసులు, అధికారులు సంయుక్తంగా అతనిని బలవంతంగా భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడ రెండురోజులపాటు బంధించి రెండోరోజు సాయంత్రం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి విడిచిపెట్టి వెళ్లిపోవడంతో అక్కడి నుంచి స్థానికుల సహాయంతో తిరిగి వెలివర్రు చేరుకున్న వెంకటేశ్వరరాజు దీక్ష కొనసాగిస్తున్నారు.


